ఢిల్లీ కి జగన్ ! బీజేపి పెద్దలు ఆగ్రహిస్తారో అనుగ్రహిస్తారో ? 

ఏపీ సీఎం జగన్ నేడు హస్తిన బాట పట్ట బోతున్నారు.

ఈ టూర్ లో కేంద్ర బిజెపి పెద్దలను కలిసి అనేక విషయాలపై జగన్ చర్చించనున్నట్లు సమాచారం.

ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి వారితో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యి అనేక అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది.అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను కలిసి ఏపీకి నిధుల కేటాయింపు పైనా, బడ్జెట్ లో ఏపీకి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే అంశంపై నా ఆయన  చర్చించ బోతున్నారట.

ఇదిలా ఉంటే జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకోవడం వెనుక అనేక రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా కొద్దిరోజులు ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, విగ్రహాలు ధ్వంసం వ్యవహారంతో అదే పనిగా ఏపీ బీజేపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

టిడిపి, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల వారితో ఇబ్బందికర పరిస్థితులను వైసీపీ ప్రభుత్వం  ఎదుర్కొంటోంది.

Advertisement

ఏపీలో ఆలయాల పై జరుగుతున్న దాడులు, విగ్రహాల ధ్వంసం వ్యవహారం వంటివి చోటు చేసుకుంటూ  వస్తుండడం తో, కేంద్ర బిజెపి పెద్దలు ఏపీ ప్రభుత్వం పైన ఆగ్రహంగా ఉన్నట్లు జగన్ కు సంకేతాలు రావడంతో, ఇప్పుడు అన్ని విషయాలపైనా కేంద్ర బిజెపి పెద్దలతో చర్చించి బీజేపీ కేంద్ర పెద్దలకు జగన్ వివరణ ఇవ్వబోతున్నట్లు సమాచారం.ముఖ్యంగా ఏపీ ఘటనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు జగన్ క్లారిటీ ఇవ్వబోతున్నారట.ఈ దాడుల వెనుక టిడిపి కుట్ర ఉందనే విషయాన్ని అమిత్ షా కు  జగన్ చెప్పబోతున్నట్టు తెలుస్తోంది.

ఏపీలో పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు అవుతున్న తరుణంలో, ప్రభుత్వానికి క్రెడిట్ రాకుండా చేసేందుకు టిడిపి ఈ రకమైన ఎత్తుగడలకు పాల్పడుతోందనే విషయాన్ని ఢిల్లీ పెద్దలకు చెప్పబోతున్నారట.అలాగే పోలవరం ప్రాజెక్టు తో పాటు వివిధ అంశాలపై చర్చించి ఏపీకి ఆర్ధిక ప్రయోజనాలు కల్పించాలనే డిమాండ్ తో నేడు జగన్ ఢిల్లీకి వెళ్లబోతున్నట్లు సమాచారం.

 అమిత్ షా నిర్మలాసతారామన్ తో పాటు, మరికొంతమంది మంత్రులను, కుదిరితే ప్రధాని మోదీని కలిసి జగన్ వివరణ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు