బాబు వరాలు : దివ్యంగుల పెన్షన్ పది వేలకు పెంపు  

  • వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు వరాల జల్లులు ప్రకటిస్తూ… వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వైసీపీ కూడా ఎన్నికల ముందు పెద్ద ఎత్తుగా సంక్షేమ పథకాలు ప్రకటించే ఉద్దేశంలో ఉండడంతో ముందే మేల్కొన్న బాబు ఒక్కో పథకం ప్రకటించడమే కాదు ఇప్పటి నుంచే వాటిని అమలు కూడా చేసేస్తున్నాడు. నిన్ననే వృధాప్య పింఛన్ రెండువేలుకు పెంచారు.

  • Ap Cm Announced New Rehabilitation Pention-

    Ap Cm Announced New Rehabilitation Pention

  • అయితే ఈరోజు దివ్యంగులకు మరో సంక్రాంతి కానుక ప్రకటించారు. రెండు చేతులు లేని వికలాంగులకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వాటిని ఈనెల నుండే అమలు చేస్తున్నామని ప్రకటించడంతో ఫిబ్రవరి నెల పెన్షన్ తో పాటు కలిపి ఇవ్వనున్నారు. నిన్న ప్రకటించిన వృద్ధాప్య పెన్షన్ కూడా జనవరి నెల మొత్తాన్ని కూడా ఫిబ్రవరి నెల నుండే అమలు చేయనున్నారు.