చివరి క్యాబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు!

ఏపీ గవర్నమెంట్ క్యాబినెట్ చివరి సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మరో నెల రోజులో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం వున్న నేపధ్యంలో క్యాబినెట్ బేటీలో చంద్రబాబు పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.

వీటిలో ముఖ్యంగా జర్నలిస్ట్ లకి స్థలం కేటాయింపుపై నిర్ణయం తీసుకున్న చంద్రబాబు వారికి ఎకరా 30 లక్షల చొప్పున 30 ఎకరాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.అలాగే ఎన్జీవో, ఏపీ సచివాలయం ఉద్యోగులకి గతం నాలుగు వేలు చొప్పున 230 ఎకరాల స్థలం కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

అలాగే అన్నదాత సుఖీభవ పథకం క్రింద రైతులకి అందించాలని నిర్ణయించుకున్న ఆర్ధిక సహాయంని రెండు విడతలలో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.కేంద్రం ఇచ్చే ఆరు వేల ఆర్ధిక సహాయంకి అదనంగా నాలుగు వేలు కలిపి ఎకరాకి పది వేల ఆర్ధిక సహాయం రైతులకి అందించడానికి క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది.

ఇవే కాకుండా డ్వాక్రా మహిళలకి ఇచ్చిన పది వేల రూపాయిల చెక్కులపై కూడా క్యాబినెట్ లో చర్చించారు.మొత్తానికి సిఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలతో చివరి క్యాబినెట్ సమావేశాన్ని ముగించి ఎన్నికల రణరంగంలో ప్రజల ఓటు కోసం సిద్ధం అవుతున్నారు.

Advertisement
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

తాజా వార్తలు