ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.ఉదయం 11 గంటలకు క్యాబినెట్ మంత్రులు సమావేశం కానున్నారు.
అసెంబ్లీ సమావేశాలు సహా కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు.సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సినిమా టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ విధానం సినిమాటోగ్రఫీ చట్ట సభల ఆర్డినెన్స్ కి ఆమోదం తెలిపే వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు.
సమాచారం.
అదే రీతిలో దేవాదాయ స్థలాలు దుకాణాల నిధులు అంశంపై దేవాదాయశాఖ చట్ట సవరణ.
దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు గురించి కూడా ఏపీ క్యాబినెట్ చర్చించనున్నట్లు సమాచారం.ఇదే సమావేశంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఒక శాఖ ఏర్పాటు చేసే విషయంపై.
క్యాబినెట్ లో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.అదే రీతిలో వివిధ కంపెనీలకు భూకేటాయింపులు వంటి వాటిపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం.