ఏపీలో బలపడేందుకు బిజెపి ఎంతో కాలంగా, ఎన్నోరకాలుగా , ప్రయత్నాలు చేస్తూనే ఉంది .కానీ ఆ ప్రయత్నాలు ఏవి వర్క్ ఔట్ కావడం లేదనే అసంతృప్తి చాలా కాలంగా బిజెపి అగ్ర నాయకత్వం లో ఉంది.
గతంలో టిడిపి వంటి పార్టీలతో పొత్తు కారణంగా బిజెపి ఏపీలో బలపడ లేకపోయింది అనే అభిప్రాయం అందరిలోనూ ఉండడంతో, ఆ పార్టీకి దూరమైంది.సొంతంగా ఎదిగేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న, వర్క్ ఔట్ అవ్వడం లేదు.
ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ను తీసుకు వచ్చిన సమయంలో మొదట్లో చేరికల విషయంలో దూకుడు కనిపించినా ,ఆ తరువాత పరిస్థితి యధా విధంగానే మారిపోయింది.ప్రస్తుతం బిజెపిలో చేరే వారు ఎవరూ కనిపించడం లేదు.
సరిగ్గా ఇదే సమయంలో ఇటీవల తిరుపతికి వచ్చిన బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీ నేతలకు గట్టిగానే క్లాస్ పీకారు.టిడిపి, వైసీపీ లకు వ్యతిరేకంగా బిజెపి వ్యవహరించాలని ప్రజా సమస్యల విషయంలో గట్టిగా పోరాడడం తో పాటు, ఏపీలో బీజేపీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని , దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించాలని అమిత్ షా ఏపీ బిజెపి నేతలకు గట్టిగానే క్లాస్ పీకారు.
దీంతో ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహించేందుకు బిజెపి ఆధ్వర్యంలో చేరికల కోసం ఒక ప్రత్యేక కమిటీని సైతం నియమించుకున్నారు. ఈ కమిటీ వివిధ పార్టీలోని అసంతృప్త నాయకులను గుర్తించడంతో పాటు, వారు బిజెపిలో చేరితే కలిగే ప్రయోజనం ఏమిటి ? చేరేందుకు వారిని ఏ విధంగా ఒప్పించాలి ? ఇలా అనేక అంశాలు అన్నీ ఆ కమిటీ ఆధ్వర్యంలోనే జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించారు.

ముఖ్యంగా టిడిపి నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించాలని సర్వం సిద్దం చేసుకోగా అకస్మాత్తుగా ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న వ్యవహారంలో టిడిపి అధినేత చంద్రబాబు మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకోవడం వంటి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి. దీంతో టిడిపి పై సానుభూతి పెరిగింది .అలాగే పార్టీ నాయకులలోనూ టిడిపిని అధికారంలోకి తీసుకురావాలని పట్టుదల పెరిగింది .ఇక పార్టీ కోసం మరింత కష్టపడి పని చేయాలనే అభిప్రాయం పార్టీ నేతల్లో పెరిగింది.ఈ పరిణామాలన్నీ వలసలపై ఆశలు పెట్టుకున్న ఏపీ బిజెపి నేతలకు తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి.