ముద్రగడ తో వీర్రాజు చర్చలు  !  బీజేపీ లో కి వస్తున్నారా ?

కాపులను బీసీల్లో చేర్చాలని టిడిపి ప్రభుత్వ ఉన్న సమయంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి, వార్తల్లోకెక్కిన మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఇప్పుడు పూర్తిగా కాపు ఉద్యమానికి , రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

గతంలో ఈ ఉద్యమాలు, రాజకీయాల కారణంగా తాను ఆర్థికంగా, సామాజికంగా ఎంతో నష్టపోయానని చెప్పిన ముద్రగడ పద్మనాభం అప్పటి నుంచి సైలెంట్ గా ఉంటూ వచ్చారు.

ఆయన వైసిపి లో చేరతారని ప్రచారం గట్టిగానే నడిచింది.అప్పట్లో కాపు ఉద్యమం ముద్రగడ చేస్తున్నా, జగన్ ఆయన వెనుక ఉన్నారు అనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో, వీర్రాజు వైసీపీ లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

కానీ ముద్రగడ మాత్రం  సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.ఆయనను చేర్చుకోవడం ద్వారా ఏపీలో ప్రధాన సామాజిక వర్గమైన కాపులు తమవైపు ఉంటారనే అభిప్రాయం అన్ని రాజకీయ పార్టీలలోనూ ఉంది.

ముద్రగడ కోసం జనసేన, వైసిపి, బిజెపి ఈ మూడు పార్టీలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.కానీ ముద్రగడ తన మనసులో మాట ఇప్పటికీ బయటపెట్టలేదు .ఇదిలా ఉంటే తాజాగా తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి లోని ముద్రగడ పద్మనాభం స్వగృహంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆయనను కలుసుకోవడం, ఈ సందర్భంగా అనేక అంశాలపై చర్చించడం వంటి వ్యవహారాలు ఈరోజు చోటుచేసుకోవడంతో,  ముద్రగడ బిజెపిలో చేరుతున్నారని ప్రచారం ఊపందుకుంది.వీర్రాజు ముద్రగడ పద్మనాభం కలవడం ఇది మొదటిసారి కాదు గతంలో ఓసారి ఏపీ బీజేపీ అధ్యక్షుడు హోదాలో ఆయనను కలిసి బిజెపిలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేశారు.

Advertisement

ఇప్పుడు మరోసారి చర్చలు జరుపుతుండడంతో ముద్రగడ బిజెపి లోకి వచ్చే ఛాన్స్ ఉందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది . చాలా కాలంగా ఏపీలో బలపడాలని చూస్తున్న బిజెపి పెద్దఎత్తున ప్రజాబలం ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకోవాలని చూస్తోంది.దీనిలో భాగంగానే ఇప్పుడు ప్రజా బలం ఉన్న నాయకులను చేర్చుకునే విషయంపై ఆ పార్టీ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు