అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పు.ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సత్య కుమార్.
సాయంత్రం అధికారిక ప్రకటన చేయనున్న బిజెపి అధిష్టానం.ఏపీ బీజేపీ అధ్యక్షుడి హోదాలో విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న సోము వీర్రాజు.
అల్లూరి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన సోమువీర్రాజు.

సోమువీర్రాజు కామెంట్స్….అల్లూరి పోరాట స్ఫూర్తి మనకు ఆదర్శం.స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన దేశభక్తుడు అల్లూరి తెలుగువారి జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.
ఆంగ్లేయులపై పోరాటంలో అల్లూరిది ప్రత్యేక విధానం.సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడిగా పేర్కొన్నారు.
కేవలం 27 ఏళ్ళ వయసులోనే పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొని ప్రజల్లో పోరాటం పట్ల విశ్వాసం రేకెత్తించారన్నారు.







