న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఈటెల రాజేందర్ ను చంపేందుకు కుట్ర

20 కోట్లు పెట్టి మీ ఈటెల రాజేందర్ ను చంపేస్తానని కౌశిక్ రెడ్డి అన్నారని, ఇదంతా సీఎం కేసీఆర్ చెబితేనే ఎమ్మెల్సీ మాట్లాడుతున్నారని ఈటెల రాజేందర్ భార్య జమున( Etela Jamuna ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

2.పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సెటైర్లు వేశారు.సినిమా వాళ్లకి ప్రజలు ఆదరణ ఉంటుంది.యాంకర్ అనసూయ రాజమండ్రి వచ్చినా జనం ఇదేవిధంగా కిక్కిరిసిపోతారంటూ గ్రంధి కామెంట్ చేశారు.

3.భారీ వర్షాలపై ఐఎండి హెచ్చరిక

దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

4.పక్క రాష్ట్రాల్లో ఆర్టీసీ పరిస్థితి బాగాలేదు : పువ్వాడ

పక్క రాష్ట్రాల్లో ఆర్టీసీ పరిస్థితులు బాగాలేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్( Puvvada Ajay Kumar ) అన్నారు.

5.జగన్ కు జోగయ్య బహిరంగ లేఖ

సీఎం జగన్ కు కాపు నేత చేగొండి హరి రామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు.ఈ లేఖలో అనేక అంశాలకు సంబంధించి జోగయ్య జగన్ కు ప్రశ్నలు సందించారు.

6.పవన్ కళ్యాణ్ కు స్వల్ప అస్వస్థత

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఉదయం 11 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) జనసేన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కావాల్సి ఉంది.దీనిని సాయంత్రానికి వాయిదా వేశారు.

7.లక్ష్మీపార్వతి కామెంట్స్

తెలుగుదేశం పార్టీని నందమూరి ఫ్యామిలీకి అప్పగించాలని,  జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని వైసిపి నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి( Nandamuri Lakshmi Parvathi ) అన్నారు.

8.కెసిఆర్ కు శ్రీ విట్టల్ రుక్మిణి విగ్రహం బహుకరణ

బీఆర్ఎస్ అధినేత,  తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన రెండో రోజు కొనసాగుతోంది ఈ పర్యటనలో భాగంగా కేసీఆర్ కు శ్రీ విట్టల్ రుక్మిణి విగ్రహాన్ని ఓ భక్తుడు బహూకరించాడు.

9.5 కొత్త వందే భారత్ రైళ్లు ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మధ్యప్రదేశ్ లో ఐదు కొత్త వందే భారత్ రైళ్లను( Vande Bharat Trains 0 ప్రారంభించనున్నారు.

10.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్

నేను వైసీపీ నుంచి దూరమయ్యాకే తెలుగుదేశం పార్టీ( TDP ) తనను ఆహ్వానించిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

11.జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే చాలామంది రాజకీయ జీవితం దెబ్బతింటుంది అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి( Congress MLA Jagga Reddy ) అన్నారు.

12.తెలుగులోనూ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్వాన్స్ కు హాజరు తెలుగు విద్యార్థులకు జేఈఈ మెయిన్ ను తెలుగు లోనూ రాసుకునే విధంగా అవకాశం కల్పించారు.

13.తెలంగాణలో భారీ వర్షాలు

Advertisement

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

14.జగనన్న అమ్మఒడి

ఏపీలోని విద్యార్థుల తల్లిదండ్రులకు జగన్ శుభవార్త చెప్పారు రేపు 28న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్న జగన్ అమ్మవారి పథకం నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

15.తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్

ఈరోజు మధ్యాహ్నం 12 నుంచి రెండు గంటల వరకు తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్ జరిగింది.రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.

16.వారాహి యాత్ర

నేడు పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి పర్యటన సాగుతోంది.

17.అంతర్జాతీయ సదస్సు

కాకతీయ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజులపాటు అంతర్జాతీయ సదస్సు ప్లాంట్ బయోటెక్నాలజీ అండ్ జీను ఎడిటింగ్ అంశంపై సదస్సు జరగనుంది .8 దేశాల నుంచి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు.

18.విద్యుత్ చార్జీల పెంపునకు నిరసన

అనంతపురం లో విద్యుత్ ఛార్జింగ్ పెంపును నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఎన్జీవో హోంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.

19.టిడిపి చైతన్య రథయాత్ర

విశాఖ పార్లమెంట్ పరిధిలో టిడిపి చైతన్య రథయాత్ర చేపట్టింది.గాజువాకలో నేడు బహిరంగ సభను నిర్వహించనున్నారు.

20.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.  9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతుంది.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు