న్యూస్ రౌండప్ టాప్ 20

1.అతిక్ అహ్మద్ హత్యపై పిల్

గ్యాంగ్ స్టార్ అతిక్ అహ్మద్ , ఆయన సోదరుడు అష్రాఫ్ లు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో పోలీసుల సమక్షంలో హత్యకు గురి కావడంపై సుప్రీంకోర్టులో ఫీల్ దాఖలు అయింది.

దీనిని ఈనెల 28న విచారించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

2.జీవో నెంబర్ ఒకటిపై ముగిసిన విచారణ

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ఒకటిపై సుప్రీంకోర్టు విచారణ ముగిసింది.దీనిపై ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ను ఆశ్రయించాల్సిందిగా పిటీషనర్ కు సుప్రీంకోర్టు సూచించింది.

3.ఏపీ పదవ తరగతి పరీక్ష ఫలితాలు

పదో తరగతి పరీక్ష ఫలితాలను మే రెండవ వారంలో విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నామని ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద రెడ్డి తెలిపారు.

4.తాడిపత్రిలో జెసి ప్రభాకర్ రెడ్డి ఆందోళన

పెన్నా నదిలో అక్రమంగా ఇసుక తరలింపును నిరసిస్తూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతుండగా, పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు.

5.పులివెందులకు అదనపు పోలీస్ బలగాల తరలింపు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత వేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో పులివెందులలో భారీగా స్పెషల్ పార్టీ పోలీసులను మోహరించారు.

6.సత్తెనపల్లిలో టిడిపి ఫ్లెక్సీలు తొలగింపు

పలనాడు జిల్లా సత్తెనపల్లిలో టిడిపి ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.

7.తిరుమల సమాచారం

Advertisement

తిరుమలలో భక్తుల సంఖ్య తగ్గింది .నేడు శ్రీవారి దర్శనానికి కేవలం రెండు కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు వేసి ఉన్నారు.

8.భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

తిరుమల తిరుపతి దేవస్థానాల పేరుతో మరో నకిలీ వెబ్ సైట్ ను టీటీడీ ఐటీ విభాగం గుర్తించింది.తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఏపీ  ఫారెన్సిక్ సైబర్ సెల్ కు అప్పగించారు.

9.చిన్న వెంకన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల లోని వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మధరావు దర్శించుకున్నారు.

10.బిజెపి పై భట్టి విమర్శలు

ప్రశాంతంగా ఉన్న దేశంలో మతకల్లోలం సృష్టించడానికి బిజెపి కుట్రలు చేస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.

11.చింతమనేని పై మంత్రి విడుదల రజిని విమర్శలు

టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని విమర్శలు చేశారు.చింతమనేని కి మహిళల పట్ల గౌరవం లేదని,  తాసిల్దార్ వనజాక్షి పట్ల ఏ విధంగా వ్యవహరించారో అంతా చూసారని , మహిళల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని , మేకప్ వేసుకుని తిరుగుతున్న నేను హాస్పటళ్లను పట్టించుకోవడంలేదని విమర్శించడం తగదని రజని అన్నారు.

12.వ్యవసాయ శాఖపై జగన్ సమీక్ష

వ్యవసాయ శాఖ పై సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు.

13.పాపికొండల యాత్ర రద్దు

ఉభయగోదావరి జిల్లాలో అకాల వర్షాలు,  ఈదురుగాలుల కారణంగా పాపికొండల విహారయాత్రను ఈరోజు,  రేపు అధికారులు నిలిపివేశారు.

14.ఔరంగాబాద్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఈరోజు ఏర్పాటు చేశారు.

15.ఏపీలో వర్షాలు పిడుగులు పడే అవకాశం

తమిళ హీరోలకు వచ్చినన్ని అవార్డ్ లు తెలుగు వారికి ఎందుకు రాలేదు ?
ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!

ఏపీలో ఈరోజు అక్కడక్కడ వర్షాలు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

16.బిజెపి ర్యాలీ

నేడు నిర్మల్ లో బిజెపి ర్యాలీని ఏర్పాటు చేశారు .బిజెపిలో చేరిన తరువాత మహేశ్వర్ రెడ్డి నిర్మల్ కి  భారీ ర్యాలీకి మహేశ్వర్ రెడ్డి అనుచరులు సిద్ధమయ్యారు.

17.ఖమ్మంలో నిరుద్యోగ ర్యాలీ

Advertisement

ఖమ్మంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు నిరుద్యోగ ర్యాలీని ఏర్పాటు చేశారు.దీనికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

18.సత్యసాయి ఆరాధన ఉత్సవాలు

పుట్టపర్తి లో సత్య సాయిబాబా 12వ ఆరాధన ఉత్సవాలు జరగనున్నాయి.

19.బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్తవ్య దీక్ష

నేడు ఎస్టిబిసి కాలేజీ గ్రౌండ్లో రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్తవ్య దీక్ష చేపట్టనున్నారు .రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాల్లో సమాన వాటా ఇవ్వాలని డిమాండ్తో ఆయన ఈ దీక్షకు దిగారు.

20.  సత్యాగ్రహ దీక్ష

ఈరోజు ఏపీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో సత్యాగ్రహ దీక్ష పేరుతో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.

తాజా వార్తలు