వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా( BRS List )ను సీఎం కేసీఆర్ విడుదల చేశారు.
ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కెసిఆర్( BRS Leader KCR ) గజ్వేల్ , కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు.
సినిమాలో రజనీకాంత్ చెప్పినట్లు మొరగని కుక్క, విమర్శించని నోళ్లు ఈ రెండు లేని వాళ్ళు ఉండరు రాజా అంటూ మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.
మద్యంతర ఉత్తర్వులు ఇచ్చేవరకు మార్గదర్శి సంస్థలపై ఎటువంటి దాడులు చేయవద్దని ఏపీ హైకోర్టు( AP High-court ) ఆదేశాలు జారీ చేసింది
డిసెంబర్ లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయని , అంతా సిద్ధంగా ఉండాలని బిజెపి అనుబంధం మోర్చాలకు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ సూచించారు.
ఏపీలో ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి( BJP Daggubati Purandeswari ) విమర్శించారు.
మంత్రి హరీష్ రావు పై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తన నియోజకవర్గంలో వదిలి తమ జిల్లాలపై హరీష్ పెత్తనం చేస్తున్నాడని మైనంపల్లి విమర్శించారు.
తిరుమల నడక మార్గంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది.కాలిబాట మార్గంలోని నరసింహస్వామి ఆలయానికి సమీపంలో సంచరిస్తున్న చిరుతని బంధించేందుకు అటవీ ప్రాంతంలో బోనులను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు.
తిరుమల( Tirumala )లో భక్తుల రద్దీ తక్కువగా ఉంది.శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం ఒక కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు.
కోవిడ్ సమయంలో విశిష్ట సేవలు అందించిన గాంధీ ఆసుపత్రికి ఐఎస్ఓ గుర్తింపు దక్కింది.
ఏఐసిసి మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనతో తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ ,ఎస్టీ నేతలు భేటీ అయ్యారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను దక్కించుకునేందుకు ఇద్దరు వ్యక్తులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Minister Errabelli Dayakar Rao Signature Forgery ) సంతకాన్ని ఫోర్జరీ చేశారు.దీంతో ఫోర్జరీ చేసిన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఎర్ర గూడెంకు చెందిన మహమ్మద్ గౌస్ పాషా, అదే జిల్లాకు చెందిన గుంటి శేఖర్ పై మంత్రి ఓ ఎస్ డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అయోధ్యలోని రామాలయ నిర్మాణం పనులను పరిశీలించారు.
అమర్నాథ్ యాత్ర( Amarnath yatra ) తొమ్మిది రోజులు ముందే మూవీ నుండి ప్రారంభమైన యాత్ర 62 రోజులపాటు కొనసాగాల్సి ఉండగా, ఈనెల 23 నుంచి తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు అమర్నాథ్ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి.
రాజకీయ ప్రకటనలకు పులిస్టాప్ పెట్టాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ కు మంత్రి హరీష్ రావు( Minister Harish Rao ) క్లాస్ తీసుకున్నారు.
జెసి ప్రభాకర్ రెడ్డి తో పాటు 13 మంది ఆయన అనుచరులపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.జూనియర్ కాలేజీ కాంపౌండ్ వాల్ కి చెందిన 53 పిల్లర్లను డామేజ్ చేసి గుంతలు పూడ్చారు అంటూ వైసీపీ నాయకుడు గురుశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు నుంచి సబ్సిడీపై ఉల్లిపాయలను విక్రయిస్తున్నారు.
మళ్లీ తెలంగాణలో అధికారంలోకి వస్తామని పెన్షన్ పెంచుతామని సీఎం కేసీఆర్ అన్నారు.
వరంగల్లో అక్టోబర్ 16న టిఆర్ఎస్ మేనిఫెస్టో( TRS Manifesto )ను విడుదల చేస్తామని ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణలోని మొత్తం 54 మెడికల్ కాలేజీలలో సీట్ల కేటాయింపు( Medical College Seat Allotment ) ఫలితాలు ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు సీల్డ్ కవర్ లో అందజేయలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంను హై కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy