న్యూస్ రౌండప్ టాప్ 20

1.బంగాళాఖాతంలో వాయుగుండం

బంగాళాఖాతంలో 48 గంటల్లో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని , జూలై 17 నుంచి 21 వరకు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

2.గాంధీభవన్ కు వచ్చిన పొంగులేటి

కాంగ్రెస్ లో చేరిన తర్వాత మొట్టమొదటిసారిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాంధీ భవన్ కు వెళ్లారు.ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.

3.పీఎం పదవిపై కాంగ్రెస్ కు ఆశ లేదు

ప్రధాన మంత్రి పదవిపై కాంగ్రెస్ కు ఆసక్తి లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

4.తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

కోకాపేటలో బీఆర్ ఎస్ కు 11 ఎకరాల భూ కేటాయింపు పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

5.విపక్షాల భేటీ పై ప్రధాని విమర్శలు

విపక్ష పార్టీల సదస్సుపై ప్రధాని నరేంద్ర మోది విమర్శలు చేశారు.పచ్చి అవినీతిపరుల సదస్సు అంటూ కామెంట్ చేశారు.

6.రాహుల్ పిటిషన్ జులై 21న సుప్రీం విచారణ

మోది ఇంటి పేరు పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.దీనిపై జులై 21న విచారణ చేపడుతామని న్యాయస్థానం వెల్లడించింది.

7.కేదార్నాథ్ ఆలయంలో.ఇవి నిషేధం

Advertisement

ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ ఆలయంలో ఫోటోలు,  వీడియోలు తీయడాన్ని నిషేధిస్తున్నట్లు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ ప్రకటించింది.

8.పాత విధానంలోనే ఎంబిబిఎస్ కౌన్సిలింగ్

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్,  బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భక్తికి ఈ ఏడాది పాత విధానంలోనే కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్రాలకు జాతీయ వైద్య మండలి క్లారిటీ ఇచ్చింది.

9.ఆర్థిక సేవ టికెట్ల కోటా విడుదల

భక్తుల సౌకర్యార్థం టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్ల కోటానూ విడుదల చేస్తోంది.ఈనెల 18న ఉదయం 10 నుంచి 20 వ తేదీ ఉదయం 10 గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు.

10.కేరళ మాజీ సీఎం మృతి

కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాంది (79) కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

11.తెలంగాణ సీఎంపై పోలీసులకు ఫిర్యాదు

గత ఏడాది జులై 17న వరదల సమయంలో వచ్చిన సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒకటి నెరవేర్చలేదని స్థానిక ఎమ్మెల్యే పోదం వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

12.చిరుత దాడిలో 12 మందికి గాయాలు

జమ్ము కాశ్మీర్ లో ఓ చిరుత పులి దాడికి దిగిన ఘటనలో 12 మంది గాయపడ్డారు అనంత నాగ్ జిల్లాలోని సల్లార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

13.ఢిల్లీలో పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు.ఎన్డీఏ కూటమి సమావేశం సందర్భంగా జనసేనకు ఆహ్వానం అందడంతో ఆయన వెళ్లారు.

14.కెసిఆర్ పై పొంగులేటి విమర్శలు

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కెసిఆర్ దోచుకున్న ప్రతి పైసా వడ్డీతో సహా కట్టిస్తామని కాంగ్రెస్ నేత ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

15.పవన్ కళ్యాణ్ పై సిపిఐ నారాయణ విమర్శలు

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

పవన్ కళ్యాణ్ ఎన్డీఏతో కలవడం బిజెపితో చేతులు కలపడం ప్రజాస్వామ్యం లౌకికవాదానికి ప్రమాదకరమని సిపిఐ నేత నారాయణ అన్నారు.

16.జగనన్న తోడు పథకం నిధులు విడుదల

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జగనన్న తోడు పథకం నిధులు ఈరోజు విడుదల కానున్నాయి.చిరు వ్యాపారులు,  వీధి వ్యాపారులకు ఆర్థిక సాయం అందించే ఈ పథకం నిధులను జగన్ ఈరోజు విడుదల చేయనున్నారు.

17.కెసిఆర్ కేటీఆర్ పై రేవంత్ విమర్శలు

Advertisement

కెసిఆర్ , కేటీఆర్ లు 1000 కోట్లు లంచం తీసుకున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.

18.డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే

సీఎం కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చినట్లుగా 12 టీచర్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిఈడి, బిఈడి అభ్యర్థుల సంఘం నాయకులు హైదరాబాద్ లక్డికాపూల్ లోని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని టిఆర్టి అభ్యర్థులు ముట్టడించి నిరసన తెలియజేశారు.

19.రేపటి నుంచి పాలీసెట్ విద్యార్థులకు స్లైడింగ్

పాలీసెట్ అడ్మిషన్లు చివరి దశకు చేరుకుంది.ఈనెల 19, 20 తేదీల్లో స్లైడింగ్ ఆప్షన్లను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 55,100 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 60,100.

తాజా వార్తలు