న్యూస్ రౌండప్ టాప్ 20

1.పీఎం మిత్ర పథకం పై కేటీఆర్ వ్యాఖ్యలు


 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines,gold Rate, Y-TeluguStop.com
Telugu Adipurush, Delhi, Gold, Janasena, Ktr, Mppriyanka, Pawan Kalyan, Pm Mithr

పీఎం మిత్ర పథకానికి కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ మోడల్ గా నిలిచిందని తెలంగాణ మంత్రి కేటీఆర్( Minister KTR ) అన్నారు.

2.విద్యా విధానంపై మంత్రి బొత్స కామెంట్స్

గతంలో విద్య అంటే కేరళ ఢిల్లీ వరకు చూసే వారిని,  కానీ ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

3.ఏపికి రుతుపవనాలు

 రుతుపవనాల రాకతో మరో రెండు మూడు రోజుల్లో ఏపీలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

4.తిరుమల సమాచారం


Telugu Adipurush, Delhi, Gold, Janasena, Ktr, Mppriyanka, Pawan Kalyan, Pm Mithr

ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు సుప్రభాతం తోమాల అర్చన , అష్టదళ పాద పద్మారాధన సేవ టికెట్లను లక్కిడిప్ కోసం నమోదు చేసుకునే అవకాశం టిటిడి( TTD ) కల్పించింది.

5.రాష్ట్రపతి పర్యటన

నేడు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్ గ్రాడ్యుయేషన్ దీనికి ముఖ్యఅతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది( President Droupadi Murmu ) హాజరుకానున్నారు.

6.గడపగడపకు మన ప్రభుత్వం పై జగన్ సమీక్ష


Telugu Adipurush, Delhi, Gold, Janasena, Ktr, Mppriyanka, Pawan Kalyan, Pm Mithr

ఈనెల 21 నుంచి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై ఏపీ సీఎం జగన్( CM YS Jagan ) సమీక్ష నిర్వహించనున్నారు .దీనికి మంత్రులు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు హాజరుకానున్నారు.

7.కాకినాడలో పవన్ కళ్యాణ్


Telugu Adipurush, Delhi, Gold, Janasena, Ktr, Mppriyanka, Pawan Kalyan, Pm Mithr

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటిస్తున్నారు.నేడు మేధావులతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు.

8.నిర్మల్ కు కంచి కామకోటి పీఠాధిపతి

నిర్మల్ కు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి రానున్నారు.సాయంత్రం పట్టణంలో జరిగే శోభాయాత్రలో ఆయన పాల్గొంటారు.

9.మెదక్ జిల్లాలో తెలంగాణ హైకోర్టు చీఫ్ పర్యటన

నేడు మెదక్ జిల్లాలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్వల బుయాన్ పర్యటిస్తున్నారు.మెదక్ జిల్లా కోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.అనంతరం మెదక్ చర్చిని సందర్శించి ఏడుపాయల అమ్మవారిని దర్శించుకోనున్నారు.

10.బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఐటీ రైడ్స్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైల్ శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్ గత మూడు రోజులుగా  జరుగుతున్న సంగతి తెలిసిందే.నేటితో ఈ రైడ్స్ ముగిశాయి.

11.కేటీఆర్ కామెంట్స్

తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలని మంత్రి కేటీఆర్ అన్నారు.

12.ఆది పురుష్ మేకర్స్ క్షమాపణలు చెప్పాలి


Telugu Adipurush, Delhi, Gold, Janasena, Ktr, Mppriyanka, Pawan Kalyan, Pm Mithr

ఆది పురుష చిత్ర బృందం పై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది( MP riyanka Chaturvedi ) ఆగ్రహం వ్యక్తం చేశారు.భారత దేశ ఇతిహాసమైన రామాయణాన్ని వక్రీకరించారని ఆది పురుష మేకర్స్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

13.అమర్నాథ్ హత్య కేసులో రాజకీయ ప్రమేయం లేదు

పదో తరగతి చదువుతున్న  బాలుడు అమర్నాథ్ పై ఓ యువకుడు పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటనలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని బాపట్ల జిల్లా ఎస్పీ  తెలిపారు.

14.మోదీ హయాంలో తెలంగాణ కు ప్రాధాన్యం

మోడీ హయాంలో తెలంగాణకు ఎక్కువగా ప్రాధాన్యం లభించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

15.హరి గోపాల్ ఇతరులపై ఉప కేసు ఎత్తివేత

హక్కులనేత ప్రొఫెసర్ హరి గోపాల్ సహ ఇతరులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులను ఎత్తు వేస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.

16.ఆది పురుష్ కు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్


Telugu Adipurush, Delhi, Gold, Janasena, Ktr, Mppriyanka, Pawan Kalyan, Pm Mithr

ఆది పురుష్ సినిమా( Adipurush )కు వ్యతిరేకంగా ఢిల్లీ కోర్టు లో పిటిషన్ దాఖలు అయింది.హిందువుల విశ్వాసాలు మనోభావాలను దెబ్బతీసేలా సినిమాను తీశారు అంటూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణుగుప్త ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజనం దాఖలు చేశారు.

17.గైడ్ బండ్ కుంగుబాటు ప్రమాదకరం కాదు

పోలవరం ప్రాజెక్టు గైడ్ బండ్ కుంగిపోయినా, అదేమీ ప్రమాదకర అంశం కాదని,  అది కేవలం ప్రవాహాన్ని నియంత్రించే ఒక కట్టడమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

18.సిబిఐకి సహకరించేందుకు సునీతకు అనుమతి

వైఎస్ వివేక హత్య కేసులో విచారణ కు సిబిఐకి సహకరించేందుకు అనుమతించాలంటూ వివేక కుమార్తె సునీత వేసిన పిటిషన్ పై సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అంగీకరించారు.

19.ఎంఈఓ టు పోస్టుల భర్తీ ప్రక్రియ నేటి నుంచి

పాఠశాల విద్యలో మండల విద్యాధికారి టూ పోస్టుల భర్తీకి శనివారం నుంచి చర్యలు చేపట్టనున్నారు.18న కౌన్సిలింగ్ నిర్వహించి 19న పోస్టింగులు ఇస్తారు.

20.విశాఖలో రౌడీ షీటర్ల కదలికలే లేవు

విశాఖలో రౌడీ షీటర్లు కదలికలేవని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube