తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
తెలంగాణ ఇంటెర్మీడియెట్ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి.
జగనన్న కు చెబుదాం పేరుతో ఏపీ ప్రభుత్వం కొత్త కార్యక్రమం ప్రారంభించింది.దీనికోసం టోల్ ప్రీ నంబర్ - 1902 ను ఏర్పాటు చేశారు.ప్రజా సమస్యలు,తమ ఇబ్బందుల గురించి ప్రజలు ప్రభుత్వానికి చెప్పుకునేందుకు దీనిని ఏర్పాటు చేశారు.
అదానీ, మోదీ బంధాన్ని ప్రశ్నింస్తే రెండేళ్ల జైలు శిక్ష వేశారని, దేశవ్యాప్తంగా దేశాన్ని రక్షించండి - మోదీని ఓడించండి అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం అని సీపీఐ నారాయణ అన్నారు.
ఏపీ లో గంజాయి వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని, వారిని హంతకులను చేస్తోందని, గంజాయి విషయంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోతే యువత భవిష్యత్తు దెబ్బతుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 10 వ తేదీన పర్యటించనున్నారు.
ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందిందని, తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, హీరోయిన్ లయ ఇక్కడి అభివృద్ధి గురించి ఎంతో గొప్పగా చెప్పారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ( K.T.Rama Rao )అన్నారు.8
తాను సింగల్ గా రమ్మన్నా వస్తా, మందితో రమ్మన్నా వస్తా, తనపై చేసిన వ్యాఖ్యలను నిరూపించే దమ్ముందా అంటూ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి లోకేష్ కు సవాల్ చేసారు.
జెపీఎస్ లను రెగ్యులరైజ్ చేయకుండా సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకే దిక్కులేదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.
రాబోయే మూడు రోజుల్లో ఏపీ , యానాం లలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
లు ఆగస్టు ఒకటో తేదీ నుంచి సైన్యంలో బీ గ్రేడియార్ ఆ పై స్థాయి అధికారులకు ఒకే విధమైన యూనిఫార్మ్ నిబంధన అమల్లోకి రాబోతోంది.
అకాల వర్షాలతో రైతులు రోడ్డున పడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు జగన్ తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితమయిపోయారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం లకు అదనపు భారం తగదని ఏపీ ప్రభుత్వ సీఎస్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు.
రాష్ట్రంలో కురిసిన వానలకు పంట తడిచి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం సేకరణలో ఎఫ్ సి ఐ , కేంద్రం నిబంధనలు సడలించాలని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్( Gangula Kamalakar ) డిమాండ్ చేసారు.
జూనియర్ పంచాయతీ క్రయదార్సులను రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు.
పంట నష్ట పరిహారం విషయంలో రైతులకు న్యాయం చేస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాణ( Botsa Satyanarayana ) అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.తన కూతురితో కేసు పెట్టించారని ఈ విధంగా తనను ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ యాదగిరి రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.
హైదరాబాద్ లో ఉగ్రవాద కదలికలు బయటపడ్డాయి.కేంద్ర ఇంటలిజెన్స్ సమాచారంతో తెలంగాణ ,మధ్యప్రదేశ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy