న్యూస్ రౌండప్ టాప్ 20 

1.ఆచార్య లీకులపై నిర్మాతల ఆగ్రహం

చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాకు సంబంధిచిన కొన్ని సీన్లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంపై ఆ సినిమా నిర్మాతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

దీనిపై పోలీసుల వైఖరి పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

2.నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

ఏపీ లో పంచాయతీ ఎన్నికల ప్రచార ఘట్టం   సోమవారంతో ముగియనుంది.

3.సొంత వాళ్లే మోసం చేశారు : రాజేంద్ర ప్రసాద్

డబ్బు విషయంలో తనను సొంత వాళ్లే మోసం చేశారని సినీ హాస్య నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు.

4.కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కబడ్డీ ఆడారు.చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.నిండ్ర లో కబడ్డీ పోటీల సందర్భంగా ఆమె ఇలా ఉల్లాసంగా గడిపారు.

5.తమిళనాడు వెళ్లాలంటే ఈ పాస్ తప్పనిసరి

కరోనా వైరస్ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో తమిళనాడు లో కరోనా ఆంక్షలు విధించారు.ఏపీ, కర్ణాటక,పుధిచ్చేరి మినహా మిగతా  రాష్ట్రాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఈ పాస్ తీసుకోవాలి అనే నిబంధన విధించారు.

6.తిరుపతి వైసీపీ మేయర్ అభ్యర్థిగా శిరీష

తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా డాక్టర్ శిరీష ను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది.

7.నేను పేకాట ఆడతా అయితే ఏంటి ? : మంత్రి బాలినేని

అవును నేను స్నేహితులతో కలిసి పేకాట ఆడుతా అయితే ఏంటి ? రాజకీయ విమర్శలు సరే వ్యక్తిగత విమర్శలు సంస్కారం కాదు అంటూ ఏపీ విద్యుత్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.

8.వకీల్ సాబ్ కొత్త పోస్టర్ విడుదల

పవన్ కళ్యాణ్ - వేణు శ్రీరామ్ కలయికలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాకు సంబందించిన కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.

9.మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు మృతి

మాజీ ఎంపీ మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

10.భైంసా అల్లర్లపై అమిత్ షా ఆరా

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో చెలరేగిన అల్లర్ల పై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు.

11.  తెలంగాణలో కరోనా

గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 111 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

12.పెళ్లి కానుక గా జోడెడ్ల బండి

పెళ్లి లో వరుడికి కానుకగా జొడెడ్ల బండిని కానుక గా ఇచ్చిన ఘటన కొమరం భీమ్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

13.అరుణాచల్ సరిహద్దు కి చైనా బుల్లెట్ రైలు

అరుణాచల్ సరిహద్దులకు సమీపంలోని టిబెట్ వరకు బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు చైనా సిద్దం అవుతోంది.

14.అబ్దుల్ కలాం సోదరుడి మృతి

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ సోదరుడు మహ్మద్ ముత్తు మీరా లెబ్బాయ్ మరాయ్ కయార్ (104) కన్ను మూశారు.

15.మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా

Advertisement

తెలంగాణ గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కరోనా పాజిటివ్ ప్రభావానికి గురయ్యారు.

16.హోమ్ మంత్రి మనవడిపై పోలీస్ లకు ఫిర్యాదు

తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ మనవడు ఫరాన్ ర్యాగింగ్ చేస్తూ, తమను వేధిస్తున్నాడు అంటూ కొందరు విద్యార్థులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

17.కీసరకు ప్రత్యేక బస్సులు

తెలంగాణలోని కీసారకు మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ గంగులోతు జగన్ తెలిపారు.

18.అన్నాడీఏంకే కు హీరో మద్దతు

తమిళనాడు లో ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అక్కడి అన్నాడీఎంకే కు తమిళ హీరో కార్తీ మద్దతు తెలిపారు.

19.రేపు చెన్నై కు రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి రామనాథ్ కొవింద్ మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం చెన్నై కు వెళ్తున్నారు.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 43,530 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర - 44,530.

Advertisement

తాజా వార్తలు