న్యూస్ రౌండప్ టాప్ 20

1.బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించిన కాంగ్రెస్

  తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రసంగాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది.

 

2.తెలంగాణ బడ్జెట్

 

2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 

3.యాదాద్రిలో గవర్నర్

  తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయన్ని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ దర్శించుకున్నారు. 

4.ప్రభుత్వ పథకాలతో సమగ్ర అభివృద్ధి

ప్రభుత్వ పథకాలతో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు సాధ్యమవుతుందని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో ప్రస్తావించారు.

5.వాకౌట్ చేసిన టిడిపి సభ్యులు

  ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగించారు.

Advertisement

గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో గవర్నర్ గో బ్యాక్ అంటూ టిడిపి సభ్యులు నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు.అనంతరం సభ నుంచి వారు వాకౌట్ చేశారు. 

6.వైసీపీ పై అచ్చెన్న కామెంట్స్

 

గత మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ సభ్యులను అవమానాలకు గురిచేస్తోందని వైసీపీ ప్రభుత్వం పై టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

7.శ్రీకాకుళంలో 3 కే రన్

  శ్రీకాకుళంలో మహిళా దినోత్సవం సందర్భంగా సెవన్ రోడ్ జంక్షన్ నుంచి ఉమెన్ పోలీస్ స్టేషన్ వరకు 3కే రన్ నిర్వహించారు. 

8.బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన సమితి ర్యాలీ

మహబూబాబాద్ లో బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధనకు కాంగ్రెస్ సిపిఐ ,సిపిఎం, టిడిపి ఆధ్వర్యంలో గాంధీ పార్క్ నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. 

9.త్వరలో వైసిపి సభ్యత్వ నమోదు

 

త్వరలోనే వైసీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. 

10.పోలవరానికి కేంద్రం 55 వేల కోట్లు ఇచ్చింది : వీర్రాజు

 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం 55 వేల కోట్లు ఇచ్చిందని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. 

11.ఏపీ లో కరోనా

  గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

12.తెలంగాణ లో కరోనా

 

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

13.రాబోయేది బిజేపి ప్రభుత్వమే

 

Advertisement

తెలంగాణ లో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. 

14.భారత్ లో కరోనా

  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4,362 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

15.తెలంగాణ లో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు

 

తెలంగాణలో ప్రస్తుతం 17 వైద్య కళాశాలలు ఉన్నాయని ఇవి కాకుండా మరో 8 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని ఆర్థికమంత్రి హరీష్ రావు ప్రకటించారు. 

16.25 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  ఈనెల 25 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 

17.తెలంగాణ బిజెపి ఎమ్మెల్యేల అరెస్ట్

 

తెలంగాణ బిజెపి ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్ లను పోలీసులు అరెస్టు చేశారు.సభలో సస్పెన్షన్ కు నిరసనగా అసెంబ్లీ బయట ఆందోళన చేస్తున్న ఈ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసి, బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

18.తెలంగాణ బీఏసీ సమావేశం

  తెలంగాణ బిఏసి సమావేశం కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైంది. 

19.తెలంగాణ అసెంబ్లీ వద్ద ఎన్ఎస్ యూఐ ధర్నా

  తెలంగాణ అసెంబ్లీ వద్ద ఎన్ ఎస్ యు ఐ ధర్నాకు దిగింది.బల్మూరి వెంకట్ నాయకత్వంలో అసెంబ్లీ ముట్టడికి ఎన్ఎస్ యూ ఐ కార్యకర్తలు ప్రయత్నించారు. 

20.ఈరోజు బంగారం ధరలు

 

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 49,400   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 53,890.

తాజా వార్తలు