న్యూస్ రౌండప్ టాప్ 20 

1.లోన్ యాప్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

లోన్ యాప్ కేసులో సైబరాబాద్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

దీనికి సంబంధించి కీలక ఆధారాలను సేకరిస్తున్నారు.

2.  జిహెచ్ఎంసి వద్ద బిజెపి ఆందోళన

జిహెచ్ఎంసి కార్యాలయం వద్ద ఈరోజు బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

3.డ్రైవింగ్ లైసెన్స్  గడువు 30 వరకు

గడువు ముగిసి రెన్యువల్ చేసుకోవాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ లు, పర్మిట్ లు, వాహన పిట్మెంట్ సర్టిఫికెట్ల రెన్యువల్ గడువు కేంద్రం ఈ నెల 30 వరకు పొడిగించింది.

4.ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలపై భేటీ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం హరీష్ రావు అధ్యక్షతన జరిగింది.

5.నిర్మల సీతారామన్ కు కేటీఆర్ లేఖ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.ఆత్మ నిర్బర్ భారతి పేరిట సహాయ ఫ్యాకేజి ప్రకటించి ఏడాది అవుతున్నా ప్రయోజనం లేదని కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు.

6.రాహుల్ పుట్టినరోజు వేడుకలు వద్దు

ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ఎటువంటి వేడుకలు నిర్వహించవద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.

7.తెలంగాణలో కరోనా

గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 1492 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

8.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 62,480 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

9.ఏపీలో కర్ఫ్యూ సడలింపు

ఏపీలో కర్ఫ్యూ ను సడలిస్తూ ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకూ ఈ సడలింపు లు ఇచ్చారు.

10.వివేకా హత్య కేసు

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ పన్నెండో రోజూ సీబీఐ అధికార్లు కొనసాగించారు.వివేక ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి ని ఈరోజు విచారించారు.

11.దేవినేని ఉమ పై  కేసు నమోదు

మాజీ మంత్రి దేవినేని ఉమా పై కృష్ణా జిల్లా మైలవరం లో హత్య కేసు నమోదయింది.

12.నేడు జాబ్ క్యాలెండర్ విడుదల

Advertisement

ఏపీ ప్రభుత్వ విభాగాల్లో వివిధ ఖాళీల భర్తీ నిమిత్తం జాబ్ క్యాలెండర్ ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది.

13.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతుంది.గురువారం 15, 310 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

14.నేడు రేపు ఏపీకి వర్ష సూచన

నేడు రేపు ఏపీలో  వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

15.జగన్ తో కొత్త ఎమ్మెల్సీల భేటీ

ఏపీ సీఎం జగన్ తో కొత్త ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి భేటీ అయ్యారు.

16.ఢిల్లీ లో తమిళనాడు సీఎం

ఢిల్లీ లో తమిళనాడు సీఎం స్టాలిన్ బిజీ బిజీగా గడిపారు.నిన్న ప్రధాని మోడీ ని కలిసిన ఆయన ఈరోజు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.

17.కేరళ తీరంలో కొత్త దీవి

కేరళ కేరళ కొత్త దీవి ఉన్నట్టు గూగుల్ మ్యాప్ లో ఉన్నట్టు తేలడంతో అధికారులు సైతం షాక్ అయ్యారు.

18.ప్రపంచ టాప్ లీడర్ గా  నరేంద్ర మోదీ

ప్రపంచ నాయకులకు సర్వే నిర్వహించే " మార్నింగ్ కన్సెల్ట్ సంస్థ తమ సర్వే ను విడుదల చేసింది.ఈ నివేదికలో అత్యంత ఎక్కువ మంది నమ్ముతున్నారు నేత నరేంద్ర మోది మొదటి స్థానంలో నిలిచారు.

19.జూన్ 21 నుంచి మాల్స్ రెస్టారెంట్లు ఓపెన్

జూన్ 21 నుంచి మాల్స్ రెస్టారెంట్లు కర్ణాటకలో తిరిగి తెరుచుకోబోతున్నాయి.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,350 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,350.

కెనడాలోని ఎన్ఆర్ఐలకు లాస్ట్ ఛాన్స్ .. ఈ వీకెండ్‌లో చివరి బ్యాచ్ కాన్సులర్ క్యాంప్‌లు
Advertisement

తాజా వార్తలు