న్యూస్ రౌండప్ టాప్ 20

1.108 అంబులెన్సు లపై ఫిర్యాదులు

108 అంబులెన్స్ లపై వస్తున్న ఫిర్యాదులపై విచారణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

2.కృష్ణ ,గోదావరి నదీ బోర్డ్ చైర్మన్లతో నేడు సమీక్ష

కృష్ణ, గోదావరి నది బోర్డు ల చైర్మన్ ల తో కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి గురువారం సమీక్ష నిర్వహించనున్నారు.

3.డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారుల గుర్తింపు

తెలంగాణ డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు.వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేశారు.

4.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతున్నాయి.బుధవారం తిరుమల శ్రీవారిని 27,446 మంది భక్తులు దర్శించుకున్నారు.

5.త్వరలో ఉద్యోగుల పరస్పర బదిలీ ఉత్తర్వులు

తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పరం బదిలీలపై త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

6.మేడారం జాతరకు 3845 ప్రత్యేక బస్సులు

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 3845 ప్రత్యేక బస్సులు నడపడానికి టిఎస్ఆర్టిసి ఏర్పాట్లు చేస్తోంది.

7.నేడు నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎల్ రమణ, యాదవ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

8.ఆర్టీసీ నూతన వెబ్ సైట్

తెలంగాణ ఆర్టీసీ కి నూతన వెబ్సైట్ ను ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆర్టీసీ ఎండి సజ్జనార్ తో కలిసి ప్రారంభించారు.

9.గవర్నర్ కు టిడిపి ఫిర్యాదు

టిడిపి నిజ నిర్ధారణ కమిటీ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసింది.గుడివాడలో కేసినో నిర్వహించారని గవర్నర్ కు కమిటీ నేతలు ఫిర్యాదు చేశారు.

10.వైసీపీపై సోము వీర్రాజు కామెంట్స్

Advertisement

వైసిపి  కేసినో పార్టీ అని బిజెపి ఏపీ అధ్యక్షుడు సోమవారం కామెంట్ చేశారు.

11.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,86,385 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

12.ఏపీలో కొత్త జిల్లాల పై అభ్యంతరాలు

ఏపీలో ఏర్పాటు చేయబోతున్న కొత్త జిల్లాలపై అప్పుడే అభ్యంతరాలు మొదలయ్యాయి.తూర్పు గోదావరి ఏజెన్సీ లో భాగమైన రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలపడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.

13.కొత్త జిల్లాల ఏర్పాటు పై కమిటీ వేయాలి

ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తీరును ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుబట్టారు.వెంటనే దీనిపై కమిటీని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.

14.కాణిపాకం లో దారుణం

కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం లో దారుణం చోటుచేసుకుంది.ఆలయానికి చెందిన పాత రథచక్రాలకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.

15.నేటి నుంచి ఉద్యోగ సంఘాల రిలే నిరాహార దీక్షలు

ఏపీ పిఆర్సి జీవోలో కు వ్యతిరేకంగా నేటి నుంచి జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ సంఘాల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం అవుతాయి.ఈనెల 30వరకు కొనసాగిస్తున్నట్లు ఆ సంఘ నేతలు తెలిపారు.

16.స్కూల్లో నిర్వహణపై నేడు అధికారుల సమావేశం

ఏపీలో స్కూల్లో నిర్వహణపై నేడు అధికారులు కీలక సమావేశం నిర్వహించనున్నారు.  పాఠశాలలో మ్యాపింగ్ పై ఎమ్మెల్యేలకు మూడు రోజులపాటు అవగాహన కార్యక్రమం, బడుల నిర్వహణ, టీచర్ల సర్దుబాటు పై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

17.నేడు ఎయిర్ ఇండియా ను టాటా గ్రూప్ కు అప్పగించనున్న కేంద్రం

ప్రైవేటీకరణ లో భాగంగా నేడు ఎయిర్ ఇండియా ను టాటా గ్రూపు కు కేంద్రం అప్పగించనుంది.

18.రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

నేడు పంజాబ్ లో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

19.ఏపీలో సిటిజెన్స్ సర్వీస్ పోర్టల్ ప్రారంభం

సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు గురువారం సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ 2.0 ను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.

20.ఈరోజు బంగారం ధరలు

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 45,500 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 49,450 .

Advertisement

తాజా వార్తలు