న్యూస్ రౌండప్ టాప్ 20

1.తిరుమల కు మరో ఘాట్ రోడ్

తిరుమల కి మరో ఘాట్ రోడ్ నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది.

2.ఏపీలో మరో పాదయాత్ర

ఏపీలో మారో పాదయాత్ర ప్రారంభం అవుతోంది.ఏపీలో అంధులకు చట్టసభల్లో ఒక్క శాతం రిజర్వేషన్ ను కల్పించాలని కోరుతూ ప్రకాశం జిల్లా పొన్నూలూరు కు చెందిన శ్రీనివాస ఫణి ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభం కానుంది.

3.రాజీనామా ల పై మంచు విష్ణు కీలక నిర్ణయం

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున గెలిచిన 11 మంది రాజీనామా చేయడం తో వాటిని ఆమోదించారు.

4.భారత్ లో పెరుగుతున్న ఒమి క్రాన్ కేసులు

భారత్ లో మరో ఒమి క్రాన్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.తాజాగా 33 కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసుల సంఖ్య 36 కి చేరింది.

5.యాదాద్రి లో భక్తుల రద్దీ అధికం

యాదాద్రి లో భక్తుల రద్దీ అధికంగా ఉంది.ఆదివారం కావడం తో ఎక్కువ రద్దీ ఏర్పడింది.

6.ఏపీలో వర్ష సూచన

రానున్న రెండు మూడు రోజుల్లో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

7.పాస్ పోర్ట్ అధికారి విజ్ఞప్తి

విదేశాలకు వెళ్లే ప్రయాణికులు తమ పాస్ పోర్ట్ గడువును  ఆరు నెలలు ఉండేలా చూసుకోవాలని, లేదంటే వీసాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి అని హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు.

8.సైనిక లాంఛనాలతో సాయి తేజ కు అంత్యక్రియలు

ఇటీవల హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన లాన్స్ నాయక్ సాయి తేజ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి.

9.శబరిమల కు ప్రత్యేక రైలు

శబరిమల కు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం మరో ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

10.అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న గ్రామం.తొమ్మిది కోట్ల నష్టం

Advertisement

హిమాచల్ ప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.కులు జిల్లా సైంజ్ వ్యాలీలో ఉన్న మజ్ హన్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి.26 ఏళ్ల తో పాటు రెండు దేవాలయాలు 26 పశువుల కొట్టాల కు ఈ మంటలు వ్యాపించాయి.ఈ ప్రమాదంలో దాదాపు 9 కోట్ల మేర నష్టం వాటిల్లింది.

11.చంద్రబాబుపై విజయసాయి రెడ్డి కామెంట్స్

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వెన్నుపోటు కు కేరాఫ్ అడ్రస్ అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు.

12.ఏపీలో తొలి ఒమి క్రాన్ కేసు

ఏపీలో తొలి ఒమి క్రాన్ కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఐర్లాండ్ నుంచి విశాఖకు వచ్చిన ప్రయాణికుడికి ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.

13.ఛలో డిల్లీ పోస్టర్ ఆవిష్కరించిన కవిత

చలో ఢిల్లీ పోస్టర్ ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు.

14.ఎంబీబీఎస్ విద్యార్థుల పిటిషన్ కొట్టివేత

ఎం బి బి ఎస్ సప్లిమెంటరీ రెండో సంవత్సరం పరీక్షలను మళ్లీ నిర్వహించాలని కోరుతూ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలో చదువుతున్న విద్యార్థులు వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

15.విజయవాడలో 1 నుంచి పుస్తక ప్రదర్శన

విజయవాడలో బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి ఒకటో తేదీ నుంచి పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నారు.

16.సింగరేణికి కేంద్రం అన్యాయం

ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కి కేంద్రం అన్యాయం చేస్తోందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , రాజ్యసభ సభ్యుడు నామా నాగేశ్వరరావు విమర్శించారు.

17.ముగిసిన సింగరేణి సమ్మె

సింగరేణి కేంద్రం ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండడం పై  నిరసన వ్యక్తం చేస్తూ కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష నేటితో ముగిసింది.

18.తెలంగాణలో కరోనా

గడిచిన 24 గంటలు తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 188 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

19.వరి వద్దన్న సీఎం మనకొద్దు : షర్మిల

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

వరి వద్దన్న సీఎం మనకొద్దు అంటూ వైఎస్సార్ టీ పీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -45,119 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 49,210.

Advertisement

తాజా వార్తలు