న్యూస్ రౌండప్ టాప్ 20

1 .బద్వేల్ లో వైసీపీ అభ్యర్థి గెలుపు

బద్వేల్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ భారీ ఆధిక్యతతో విజయం సాధించారు.

2.ఉక్కు ఉద్యమానికి మంద కృష్ణ మాదిగ మద్దతు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, ఉదోగా సంఘాలు చేపట్టిన నిరసన దీక్షకు ఎమ్మార్ఫీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు.

3.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.నిన్న తిరుమల శ్రీవారిని 35,747 మంది భక్తులు దర్శించుకున్నారు.

4.సీబీఐ పై హైకోర్టు ఆగ్రహం

ఏపీ న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరోసారి సీబీఐ పై హై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ కేసుపై నేడు విచారణ జరిగింది.

5.ఉపాధి బిల్లులపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ

  ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపునకు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. 

6.పవన్ పై మంత్రి కొడాలి కామెంట్స్

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అన్న పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ పార్టీకి వారం రోజులు గడువు ఇవ్వడం హాస్యాస్పదం అన్నారు. 

7.ఎర్రన్నాయుడు కి చంద్రబాబు నివాళి

Advertisement

  దివంగత టిడిపి నేత ఎర్రన్నాయుడు 9 వ వర్ధంతి సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులు అర్పించారు. 

8.గవర్నర్ తో టీటీడీ చైర్మన్ భేటీ

  ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. 

9.రాష్ట్రపతిని కలిసిన వైసీపీ ఎంపీలు

  రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో వైసీపీ ఎంపీలు మంగళవారం రాష్ట్రపతి భవన్లో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా టిడిపి పై వారు ఫిర్యాదు చేశారు. 

10.విశాఖ చేరుకున్న ఉప రాష్ట్రపతి

  భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడ నుంచి రోడ్డు మార్గాన సబ్బవరం దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీకి ఉపరాష్ట్రపతి వెళ్లారు. 

11.వరి వేయవద్దన్న కలెక్టర్ ఆదేశాల పై హైకోర్టులో పిటిషన్

  యాసంగి వరి వేయొద్దని సిద్దిపేట కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  బాతుల నారాయణ అనే వ్యక్తి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

12.టిఆర్ఎస్ పతనం ప్రారంభం : డీకే అరుణ

  టిఆర్ఎస్ పట్టణం ప్రారంభమైందని దేనికి హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని బిజెపి ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు. 

13.రానా వైరల్ ట్వీట్

  విరాట పర్వం సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి తప్పుకున్నాడని ఓ వెబ్సైట్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

ఆ ఆర్టికల్ లింక్ షేర్ చేస్తూ ఎవడు బ్రో నీకు చెప్పింది .నీ సోది " అంటూ రాణా ట్వీట్ చేశారు. 

14.12 నిరుద్యోగ మిలియన్ మార్చ్

Advertisement

  ఈ నెల 12న హైదరాబాద్లో నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. 

15.ఆర్టీసీని ప్రైవేటీకరించం

  తెలంగాణ ఆర్టీసీ ని ప్రైవేటు పరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 

16.బీసీలకు 50 శాతం సీట్లు : కాంగ్రెస్

  వచ్చే ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయిస్తామని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తెలిపారు. 

17.పోస్టల్ బ్యాలెట్ లో టిఆర్ఎస్ కు 503 ఓట్లు

  హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు లో మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ లకు టీఆర్ఎస్ 503 ఓట్లు, బీజేపీ కి 159 ఓట్లు, కాంగ్రెస్ కు 35 ఓట్లు పోలవ్వగా, చెల్లనివి 14 ఓట్లు పొలయ్యాయి. 

18.అమరావతి పై బాబు కామెంట్స్

  అమరావతి పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేము అని , రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర కు టీడీపీ తరపున సంఘీభావం తెలియజేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

19.పవన్ కళ్యాణ్ కామెంట్స్

  ప్రజల ఆస్తులను దోచుకోకుండా అడ్డుకోవడమే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 46,850   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,850  .

తాజా వార్తలు