న్యూస్ రౌండప్ టాప్ 20

1.గన్నవరం చేరుకున్న చంద్రబాబు

  టిడిపి అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.

 

2.దళిత బంధు పై కేసీఆర్ సమీక్ష

  మరో నాలుగు ఎస్సీ రిజర్వుడ్ నియోజక వర్గాల్లో  దళిత బంధు పథకం అమలు ప నేడు సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. 

3.నటుడు ఉత్తేజ్ కు భార్య వియోగం

  నటుడు రచయిత ఉత్తేజ్ భార్య పద్మావతి కాన్సర్ తో మృతి చెందారు. 

4.వేధింపులపై అచ్చెన్న విమర్శలు

  వైసీపీ నేతలతో కలిసి పోలీసులు టిడిపి కార్యకర్తలను వేధిస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. 

5.ఈశాన్య రాష్ట్రాల్లో ఇరవై విమానాశ్రయాలు

దేశంలో పర్యాటక రంగానికి తీసుకువచ్చే విధంగా ఈశాన్య రాష్ట్రాల్లో 20 విమానాశ్రయాలను  నిర్మించబోతున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

6.టీటీడీ అగర్బత్తి కేంద్రం ప్రారంభం

  టీటీడీ ఆధ్వర్యంలో అగర్బత్తి తయారీ కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రారంభించారు. 

7.అమరావతి రైతులకు ఊరట

  అమరావతి లో రైతులకు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన ప్లాట్ లను తిరిగి స్వాధీనం చేసుకుంటాము అంటూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం పై రైతులు కోర్టులో పిటిషన్ వేయగా, ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ హై కోర్టు తీర్పు వెలువరించింది. 

8.దిశా కేసులో చివరి దశ లో విచారణ

  దిశా కేసులో కమిషన్ విచారణ చివరి దశకు చేరుకుంది.కమిషన్ ముందు ఎన్ కౌంటర్ నిందితుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. 

9.సుప్రీం లో పెగసేస్ కేసు విచారణ

  సుప్రీం కోర్టు లో పెగాసెస్ కేసు విచారణ జరుగుతోంది.కమిటీ ఏర్పాటుకి తమకు అభ్యంత్రం లేదని కేంద్రం ప్రకటించింది. 

10.గణేష్ నిమజ్జనం పై రివ్యూ పిటిషన్

Advertisement

  గణేష్ నిమజ్జనం పై రివ్యూ పిటిషన్ దాఖలయ్యింది.తీర్పును పునః పరిశీలించాలని జీ హెచ్ ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. 

11.ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా .

  ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రమదసప్ప నాయుడు తెలిపారు. 

12.దళిత బంధు రివ్యుకి నేను హాజరవుతా : భట్టి

  దళిత బంధు పథకం రివ్యూ సమావేశానికి తాను హాజరవుతాను అని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. 

13.నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలి

  సైదాబాద్  బాలిక కుటుంబ సభ్యులను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు.బాలిక పై అమానుషానికి పాల్పడిన నిందితుల ఎన్కౌంటర్ చేయాలని ఈ సందర్భంగా రేవంత్ డిమాండ్ చేశారు. 

14.హిజ్రాల ధర్నా

  సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఎదుట హిజ్రాలు ధర్నాకు దిగారు.గచ్చిబౌలిలో హిజ్రాలు గ్రూప్ గా ఏర్పడి వసూళ్లకు పాల్పడుతున్నారు అంటూ మిగతా హిజ్రాలు ధర్నాకు దిగారు. 

15.కేంద్ర మంత్రికి జగన్ లేఖ

  కేంద్రమంత్రి జయశంకర్ కు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు.బెహ్రైన్ లో చాలా మంది తమ యాజమాన్యాల వద్ద మర్యాదకు గురవుతున్నారని, దీనిని పరిష్కరించాలని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. 

16.కరెంట్ చార్జీలు తగ్గించాలి

  ఏపీలో పెరిగిన కరెంట్ చార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.ఈ మేరకు మైలవరం లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. 

17.సముద్రం లో మునిగిన చెన్నై బోట్

  నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో చెన్నైకి చెందిన బోట్ ప్రమాదవశాత్తు నీట మునిగింది. 

18.ఎడ్లబండిపై అసెంబ్లీకి

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
కొత్త పార్టీ పెట్టేస్తున్న ప్రశాంత్ కిషోర్ .. పేరేంటంటే ?

  కర్ణాటక మాజీ సీఎం ప్రతిపక్ష నేత సిద్దిరామయ్య తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు ఎడ్లబండిపై అసెంబ్లీకి వచ్చారు. 

19.డమ్మీ గన్ కలకలం

  కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో డమ్మీ గన్ కలకలం రేపింది.డమ్మీ గన్, చాకు, కారం తో ఓ అర్జీదారుడు స్పందన కార్యక్రమానికి రావడం కలకలం రేపింది. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 46,010   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,010      .

Advertisement

తాజా వార్తలు