న్యూస్ రౌండప్ టాప్ 20 

1.హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్

  హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్ ను కేసీఆర్ ప్రకటించారు.

 

2.జీహెచ్ఎంసీలో నేటి నుంచి ఫస్ట్ డోస్ వాక్సిన్

  జిహెచ్ఎంసి పరిధిలో నేటి నుంచి ఫస్ట్ దోస్త్ యాక్సి కార్యక్రమం మళ్ళీ మొదలైంది. 

3.గద్వాలలో ట్రిపుల్ ఐటీ

  తెలంగాణలోని గద్వాలలో మరో ట్రిపుల్ ఐటీని ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

4.కంటతడి పెట్టిన ఉపరాష్ట్రపతి

  రాజ్యసభలో కార్యకలాపాలు అడ్డగింత పై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదనకు గురై కంటతడి పెట్టారు. 

5.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నిన్న తిరుమల స్వామివారిని 19,839 మంది భక్తులు దర్శించుకున్నారు. 

6.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 38,353 మంది కరోనా వైరస్ ప్రభావం కు గురయ్యారు. 

7.కోవిడ్ చికిత్సకు 5 లక్షల ఋణం.

  కరుణ వైరస్ ప్రభావానికి గురైన వారికి ప్రభుత్వ రంగ బ్యాంకుల పూచీకత్తు అవసరం లేకుండా ఐదు లక్షలు రుణం మంజూరు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. 

8.నేడు రేపు వర్షాలు

Advertisement

  ఏపీలో నేడు రేపు తరంగా వర్షాలు కురుస్తాయని , ఉరుము, మెరుపులతో పాటు పిడుగులు ఎక్కువ పడే అవకాశం ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 

9.ఇంటర్ అర్హత నిబంధనల తొలగింపు

  ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు  ఇంటర్ లో కనీస శాత  అర్హత నిబంధన  తొలగించినట్లు అధికార్లు తెలిపారు. 

10.30 నుంచి ఎంసెట్ ఫలితాలు

  తెలంగాణలో ఈనెల 30 నుంచి ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 

11.ఎన్.ఎస్.యూ ఎంట్రెన్స్ ఎగ్జామ్

  నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లో  ఎంట్రన్స్ కు నిర్వహించే ఎన్.ఎస్.యూ.ఈ ఈ 2021 ఎంట్రెన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 

12.డైరీ, పౌల్ట్రీ పరిశ్రమ కు విద్యుత్ రాయితీ

  తెలంగాణలో డైరీ, పౌల్ట్రీ పరిశ్రమకు విద్యుత్ రాయితీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.యూనిట్ కు 2 రూపాయల సబ్సిడీ ని ప్రకటించింది. 

13.ఉత్తమ జర్నలిస్ట్ లకు అవార్డులు

  మానవీయ కోణం లో ఉత్తమ వార్తా కథనాలను అందించిన జర్నలిస్ట్ లకు ఆర్ఎస్ ఎన్  సేవా పౌండేషన్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి మీడియా అవార్డులు ఇవ్వనున్నట్టు పౌండేషన్ వ్యవస్థాపకులు సత్యనారాయణ తెలిపారు. 

14.సర్వీస్ ఛార్జ్ లేకుండా కొవాగ్జీన్

  సర్వీస్ ఛార్జ్ లేకుండా కొవ్వు అర్జున్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తామని అపోలో ఆస్పత్రి రీజినల్ సీఈవో సుబ్రమణ్యం తెలిపారు. 

15.వివేకా హత్య కేసు

  వైఎస్ వివేకా హత్య కేసు ను సీబీఐ శరవేగంగా దర్యాప్తు చేపడుతోంది.

షారుఖ్ ఖాన్ ఎందుకు సౌత్ డైరెక్టర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు..?
పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?

ప్రధాన నిందితుడిగా హనుమంతు అదుపులోకి తీసుకున్న సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులను వారి ఇంటికి వెళ్లి విచారిస్తున్నారు.వారు ఇటీవల మీడియా సమావేశం నిర్వహించడం పై విచారిస్తున్నారు. 

16.లోక్ సభ స్పీకర్ అసంతృప్తి

Advertisement

  లోక్ సభ వర్షాకాల సమావేశాల్లో కార్యకలాపాలు జరిగిన తీరుపై సభాపతి ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

17.మమత మేనల్లుడి పై కేసు నమోదు

  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ తో పాటు మరికొందరి పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

18.కోవిడ్ నియంత్రణపై జగన్ సమీక్ష

  ఏపీలో కోవిడ్ నియంత్రణపై ఏపీ సీఎం జగన్ అధికార్లతో సమీక్ష నిర్వహించారు. 

19.రాష్ట్రమంతా దళిత బంధు

  దళిత బందు పథకం కేవలం హుజురాబాద్ కు మాత్రమే పరిమితం కాదు అని, రాష్ట్రమంతా అమలుచేస్తామని టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -43,350   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,300.

తాజా వార్తలు