నిశ్శబ్దంపై నెగిటివ్ కామెంట్స్ ని లైట్ తీసుకున్న అనుష్క

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క తన సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిత్వంతో కూడా అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.

లేడీ సూపర్ స్టార్ గా, సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా ఉన్న అనుష్క ఎప్పుడూ కూడా అనవసరమైన ఆర్భాటాలు చూపించడం.

సినిమాలలో వేసినట్లు ఈవెంట్స్ లో కురచ దుస్తులు వేయడం చేయదు.తనకి కంఫర్ట్ ఉండే కాస్ట్యూమ్స్ మాత్రమే బయట ఎప్పుడు కూడా వేసుకుంటుంది.

అలాగే చాలా సింప్లిసిటీ మెయింటేన్ చేస్తుంది.ఎంత ఎదిగిన కూడా ఒదిగి ఉండే మనస్తత్వంతో, అందరిని చిరునవ్వుతో పలకరించడం అనుష్క నైజం.

అలాగే మీడియాకు వీలైనంత దూరంగా ఉంటుంది, ఇంటర్వ్యూలపై పెద్దగా ఆసక్తి చూపించదు.కేవలం సినిమా ఈవెంట్స్ వరకు మాత్రమే బయటకి వచ్చి మాట్లాడుతుంది.

Advertisement

ఫోటోషూట్ లకి కూడా చాలా దూరంగా ఉంటుంది.స్టార్ హీరోయిన్స్ గా ఉన్నవాళ్లు చాలా మంది మోడరన్ గా కనిపించడానికి ఇష్టపడతారు.

అయితే అనుష్క మాత్రం వీరందరికంటే ప్రత్యేకం అని చెప్పాలి.ఇండస్ట్రీలో అందరితో కూడా మంచి రిలేషన్ మెయింటేన్ చేస్తుంది.

అసలు ఆమె ఎవరి మీద కూడా ఎప్పుడూ కూడా కోపాన్ని ప్రదర్శించడం చూడలేదు.ఇదిలా ఉంటే సినిమా విషయంలో కూడా ఆమె ఆలోచన చాలా సింపుల్ గా ఉంటుందని తాజాగా ఒక సంఘటన రుజువు చేసింది.

ఎంతో కష్టపడి చేసిన నిశ్శబ్దం మూవీ రిలీజ్ అయినా తర్వాత డివైడ్ టాక్ తెచ్చుకుంది.అయితే డివైడ్ టాక్ తెచ్చుకుందని ఆమె కృంగిపోకుండా ఆ విషయాన్ని చాలా లైట్ గా తీసుకుంది.

ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీకి ఆ టైటిల్ ను ఫిక్స్ చేయడం కష్టమే.. ఆ కష్టాన్ని అధిగమిస్తారా?
ఎన్టీఆర్ ఫ్యాన్ చేసిన పని తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. తారక్ ను చూడాలని 300 కిలోమీటర్లు నడిచాడా?

ట్విట్టర్ లో ఓ అభిమాని ఆమెని టాగ్ చేసి మీ నిశ్శబ్దం సినిమా నాకు అస్సలు నచ్చలేదు.దానికి లాజిక్ లేదని కామెంట్ చేశాడు.

Advertisement

దీనిపై అనుష్క చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యింది.ధన్యవాదాలు, ఇకపై మీ అభిప్రాయాలని పరిగణంలోకి తీసుకుంటాం అని రిప్లై ఇచ్చింది.

ఈ ఒక్క రిప్లై ఆమె ఆలోచన ఎలాంటిదో చెబుతుందని సోషల్ మీడియాలో అనుష్కపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజా వార్తలు