మా కూతురికి ఫ్రీడమ్ ఇవ్వాలనుకుంటున్నాం.. అలా చెయ్యనందుకు మీ అందరికి థాంక్స్: అనుష్క శర్మ

సాధారణంగా పలువురు సెలబ్రిటీలు తమ పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు.ఇంకొందరు పిల్లలు అయితే పుట్టినప్పటి వాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు.

 Anushka Sharma Says Thanks To Media For Not Publishing Vamika Photos Details, A-TeluguStop.com

ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పిల్లలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.కానీ మిగతా సెలబ్రిటీలతో పోల్చుకుంటే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ కూతురి విషయంలో పూర్తి భిన్నంగా ఉన్నారు.

అనుష్క, విరాట్ ముద్దుల కూతురు వామిక ఎలా ఉంటుంది అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.ఆ చిన్నారి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెకు సంబంధించిన ఏ ఒక్క చిన్న ఫోటోను కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు అనుష్క,విరాట్ కోహ్లీ.

అనుష్క తాజాగా ఇదే విషయంపై స్పందిస్తూ తన కూతురు వామిక ఫోటోలను ప్రచురించనందుకు మీడియాకు ధన్యవాదాలు తెలిపింది.ఇటీవలే విరాట్ కోహ్లీ, అనుష్క, తమ కూతురు వామికతో కలిసి బయటకు వెళ్ళినప్పుడు అక్కడ వామిక ఫోటోలు తీయకండి అని ఈ దంపతులు మీడియాను అభ్యర్థించారు.

Telugu Anushka Sharma, Bollywood, Vamika, Virat Kohli, Virushka-Movie

అందుకు గల కారణాలు తాజాగా అనుష్క శర్మ బయటపెట్టింది.తమ కూతురు వామిక ఫోటోలు వీడియోలు పోస్ట్ చేయనందుకు మొదట మీడియా వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.అలాగే మా చిన్నారి వామిక గోప్యతను మేము కాపాడాలి అనుకుంటున్నాము.భవిష్యత్తులో తన జీవితాన్ని స్వేచ్ఛగా జీవించడానికే మీడియాకు దూరంగా ఉంచుతున్నాము.అందుకు మా వంతుగా మేము కృషి చేస్తున్నాం.కాబట్టి ఈ విషయంలో మీరు కూడా మాకు సహకరించాలి అంటూ అనుష్క తన పోస్టులో తెలిపింది.

ఏదేమైనప్పటికీ ఈ జంట తమ కూతురు వామిక ప్రైవసి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube