మీడియా ముందుకు వస్తే తప్ప ఇచ్చిన మాట గుర్తు లేదా దేవర.. ఎన్టీఆర్ సాయం పై విమర్శలు!

ఎన్టీఆర్( NTR ) వీరాభిమాని కౌశిక్ ( Kaushik ) అనే కుర్రాడు బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఉన్నారు.

తిరుపతికి చెందిన కౌశిక కాన్సర్ తో బాధపడుతున్న నేపథ్యంలో ఈయన చివరిగా తనకు ఎన్టీఆర్ నటించిన దేవర( Devara ) సినిమా చూసి చనిపోవాలని ఉందని అప్పటివరకైనా నన్ను బ్రతికించండి అంటూ తన తల్లిని వేడుకున్న ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో ఈ విషయం ఎన్టీఆర్ వరకు చేరింది.

ఇక ఎన్టీఆర్ ఆ కుర్రాడికి స్వయంగా వీడియో కాల్ చేసి మరి మాట్లాడారు.

ఈ విధంగా ఎన్టీఆర్ ఫోన్ కాల్ మాట్లాడటమే కాకుండా తన వైద్యం కోసం సహాయం చేస్తానని చెప్పారు కానీ తన ఇచ్చిన మాట తప్పారు అంటూ ఇటీవల తన తల్లి మీడియా ముందుకు వచ్చారు.దీంతో అప్రమత్తమైన ఎన్టీఆర్ టీం వెంటనే హాస్పిటల్ కి చెల్లించాల్సిన ఫీజు మొత్తం చెల్లించడంతో కౌశిక్ డిశ్చార్జ్ అయ్యారు.అనంతరం ఆయన తల్లి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఎన్టీఆర్ గారు మాకు 12 లక్షల వరకు సహాయం అందించారని తెలియజేశారు.

దీంతో ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ మరోసారి ఎన్టీఆర్ పై ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

అభిమాని చావు బతుకుల్లో ఉంటే అండగా ఉంటానని మాట ఇచ్చారు అయితే ఇచ్చిన మాట మర్చిపోయారని ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.అభిమాని తల్లి మీడియా ముందుకు వస్తే తప్ప ఎన్టీఆర్ గారికి ఇచ్చిన మాట గుర్తుకు రాలేదా అంటూ విమర్శిస్తున్నారు.ఆమె మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్ నుంచి ఎలాంటి సహాయం అందలేదని చెప్పడంతోనే ఎన్టీఆర్ టీం వెంటనే స్పందిస్తూ హాస్పిటల్ కి చెల్లించాల్సిన ఫీజును చెల్లించారు లేకపోతే ఇప్పటికీ కూడా ఆ అభిమానికి సహాయం అందేది కాదంటూ విమర్శిస్తున్నారు.

రూ.2 కోట్ల సాయంతో బన్నీపై కోపం తగ్గినట్టేనా.. ఆ కేసు క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందా?
Advertisement

తాజా వార్తలు