టీమిండియాకు మరో షాక్‌.. జట్టు నుంచి కీలక ప్లేయర్ ఔట్!

ఈరోజు నుంచి అంటే జనవరి 18 నుంచి టీమిండియా న్యూజిలాండ్ టీమ్‌తో వన్డే సిరీస్‌ ఆడనుంది.ఈ నేపథ్యంలోనే భారత జట్టుకు భారీ షాక్ తగిలింది.

కీలక బ్యాట్స్‌మ్యాన్ అయిన శ్రేయస్ అయ్యర్ ఈ మూడు వన్డేల సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు.ఇందుకు కారణం అతడు వెన్ను నొప్పితో బాధపడటమేనని తెలుస్తోంది.

అతను దూరం కావడంతో రజత్ పాటిదార్‌ను బీసీసీఐ సెలెక్ట్ చేసుకుంది.దేశవాళీ మ్యాచ్‌ల్లో రజత్ పాటిదార్‌ చాలా బాగా ఆడి పేరు తెచ్చుకున్నాడు.

అందుకే అతడికి ఈ మూడు వన్డేల సిరీస్‌లో బీసీసీఐ చోటు కల్పించింది.

Advertisement

మూడు వన్డేల సిరీస్‌ ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి స్టార్ట్ కానుంది.హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో తొలి వన్డే మ్యాచ్ జరగనుంది.ఇక రెండో మ్యాచ్‌ను 21న రాయ్‌పూర్‌లో నిర్వహించనున్నారు.

సిరీస్‌లో ఆఖరిదైన మ్యాచ్‌ను జనవరి 24న ఇండోర్‌లో నిర్వహించనున్నారు.వన్డే సిరీస్ పూర్తయ్యాక 3-మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభమవుతుంది.

ఇకపోతే శ్రేయస్ అయ్యర్‌ 2022లో 17 వన్డే మ్యాచ్‌లు ఆడి 724 రన్స్ చేశాడు.అంటే సగటున 42 పరుగులు చేశాడు.

ఈ యావరేజ్ టాప్ బ్యాటర్లతో సమానంగా ఉందని చెప్పవచ్చు.అలాంటి ప్లేయర్ ఇప్పుడు వన్డే సిరీస్ లో ఆడకపోవడం టీమిండియాకు షాక్ అనే చెప్పవచ్చు.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ఇక కివిస్ తో ఆడే టీమిండియా వన్డే జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, రజత్ పాటిదార్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు