ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం

ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది.ఈ మేరకు జై తెలుగు పేరుతో పార్టీని సినీ గేయ రచయిత, కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రకటించారు.

 Another New Political Party Has Emerged In Ap-TeluguStop.com

తెలుగు భాషా సంస్కృతి కోసం ప్రత్యేకంగా రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తామని జొన్నవిత్తుల తెలిపారు.ఐదు రంగులతో పతాకాన్ని కూడా రూపొందించానన్న ఆయన ఇందులో నీలం రంగు నీరు, పచ్చ రంగు వ్యవసాయం, ఎరుపు రంగు శ్రమశక్తి, పసుపు వైభవానికి చిహ్నం, తెలుపు జల వనరులు స్వచ్ఛంగా ఉండాలన్నారు.

దీని ద్వారా రాజకీయ నేతలతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు.ఈ మేరకు ఆగస్ట్ 15వ తేదీ నాటికి తమ పార్టీ విధివిధానాలను ప్రకటిస్తామని వెల్లడించారు.

అదేవిధంగా తెలుగు భాషా పరిరక్షణ అజెండాతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube