ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం

ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది.ఈ మేరకు జై తెలుగు పేరుతో పార్టీని సినీ గేయ రచయిత, కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రకటించారు.

తెలుగు భాషా సంస్కృతి కోసం ప్రత్యేకంగా రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తామని జొన్నవిత్తుల తెలిపారు.

ఐదు రంగులతో పతాకాన్ని కూడా రూపొందించానన్న ఆయన ఇందులో నీలం రంగు నీరు, పచ్చ రంగు వ్యవసాయం, ఎరుపు రంగు శ్రమశక్తి, పసుపు వైభవానికి చిహ్నం, తెలుపు జల వనరులు స్వచ్ఛంగా ఉండాలన్నారు.

దీని ద్వారా రాజకీయ నేతలతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు.

ఈ మేరకు ఆగస్ట్ 15వ తేదీ నాటికి తమ పార్టీ విధివిధానాలను ప్రకటిస్తామని వెల్లడించారు.

అదేవిధంగా తెలుగు భాషా పరిరక్షణ అజెండాతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ హోమ్ రెమెడీతో మొటిమలకు కంప్లీట్ గా గుడ్ బై చెప్పేయండి!