ఇన్నాళ్లూ రామ మందిరం స్దలం పై ఉన్న వివాదం ఎటూ తేలడం లేదని బాధపడ్దాం.ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ఎట్టకేలకు రామ మందిరం భూమి సమస్య తీరిపోయింది.
ఇక మందిర నిర్మాణమే తర్వాత అని అనుకున్న సమయంలో ఆలయ నిర్మాణానికి సేకరిస్తున్న విరాళాల విషయంలో పలువురు వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనాన్ని సృష్టిస్తుంది.
మొన్నటికి మొన్న టీఆర్ఎస్‌కు చెందిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, రామ మందిరం వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం మరవక ముందే, తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన, చల్లా ధర్మారెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయోధ్య రామ మందిరం పేరుతో దొంగ బుక్కులు పట్టుకుని బీజేపీ నేతలు చందాలు వసూళ్లు చేస్తున్న విరాళాలు ఎక్కడికి పోతున్నాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
అదీగాక బీజేపీ తన రాజకీయ స్వార్థం కోసం శ్రీరాముడి పేరును వాడుకుంటూ నీచ రాజకీయాలు చేస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయంలో స్పందించిన కొందరు రామ భక్తులు అయ్యా ఎక్కడో ఎవడో తయారు చేసిన విదేశీ వస్తువులను మనం ఉపయోగించుకోగా లేనిది మన భారతదేశం లోని హిందువులు భక్తిగా కొలిచే రామయ్య మందిరానికి ఎందుకు ఇన్ని అడ్దంకులు సృష్టిస్తూ, కలియుగ రావణా సూరులు అవుతున్నారని ప్రశ్నిస్తున్నారట.