తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ ఇపుడు వివాదస్పదంగా మారుతుదా? తెలంగాణాలోని అన్ని మునిసిపాలిటీలలోని భూమి రికార్డులను గురించి తెలిపే వెబ్ సైట్ ధరణి పోర్టల్ ఇపుడు పలు వివాదాలకు కారణమవుతుందా? మరోవైపు కొనుగోళ్లు, అమ్మాకాలు, యజమనుల వివరాలు, భూమి విస్తీర్ణం తదితర అంశాలను తెలిపే వివారాల్లో, పలు లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించడంతో భూనిర్వాసితుల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు ధరణి పోర్టల్లో తెలెత్తుతున్న తప్పుల తడకపై కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కి వెళ్లి, ఏకరువు పెట్టాలని నిర్ణయించింది.
దాంతో స్పందించిన సీఎం కేసీఆర్, ధరణి సమస్యలపై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్హహించారు.ఈ నెల 15 నుంచి రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు వెళ్లి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ధరణి పోర్టల్ అనేది ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ పోర్టల్ గా టీఎస్ ప్రభుత్వం రూపొందించింది.ధరణి మా భూమి అనేది తెలంగాణ అధికారిక వెబ్‌సైట్ గా మనకు తెలిసిందే.
రాష్ట్రంలోని నివాసితులకు అన్ని మునిసిపాలిటీలలోని భూమి రికార్డుల గురించి సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ధరణి పోర్టల్ తన సేవలను అందిస్తుంది.దాంతో పాటు అదనంగా, రాష్ట్ర నివాసితులకు ఆదాయంతోపాటు, రిజిస్ట్రేషన్ సౌకర్యాలను అందించే ప్రక్రియలో భాగంగానే ఈ వెబ్ సైట్ రూపొందించబడిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ యాప్ లో తప్పుల తడకగా కనిపిస్తున్న అనేక వివరాలపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది.
ధరణి పోర్టల్ వెబ్ సైట్ రూపోందించడంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగిన విషయమే అయినా, ఈ వెబ్ సైట్ నిర్వహణలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం పప్పులో కాలేసిందనే చెప్పాలి.
తెలంగాణ పౌరులకు భూమి రికార్డులను సులభంగా యాక్సెస్ చేయడం, రిజిస్ట్రేషన్ సేవలు ఆన్‌లైన్‌లో అందించడం, భూమి రికార్డులు, సర్వే, మ్యాప్, పాఠ్య రికార్డుల నమీకరణ, పరిష్కార కార్యకలాపాల నిర్వహణ, ఆస్తి నమోదు తర్వాత మ్యుటేషన్ స్యయం చాలకం తదితర అంశాలపైనా స్పష్టమైన వివరాల కోసం ఈ వెబ్ సైట్ రూపొందించడిన విషయం తెలిసిందే.

వెబ్ సైట్ నిర్వహణలో లోపాలు, స్పష్టమైన వివారాలు పొందుపరచక పోవడం తోపాటు కోనుగోలు దారుడు, అమ్మకం దారుకి మధ్య ఉన్న వివరాలు ఇందులో పొందుపరచకపోవడం గమనార్హం.దాంతో భూ నిర్వాసితుల్లో గందరగోళ పరీస్థితుల ఏర్పడతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.మరోవైపు భూమిపై హక్కు అనే విషయంలో కొనుగోలు దారుడి పేరు చేర్చకుండా, అమ్మకం దారుని పేరు మాత్రమే కొనసాగిస్తున్నట్లు అధికారుల పరిశీలనల్లో వెల్లడైంది.
కొన్ని ప్రాంతాల్లో నమోదైన భూ విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణం చూపిస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి.మరికొన్ని ప్రాంతాల్లో సర్వేనెంబర్లు స్పష్టంగా ఉన్నప్పటికీ, వాటికి సంబంధించిన భూమి మాత్రం కనిపించడంలేదు.
మరోవైపు భూమి ఉన్నా, .విస్తీర్ణంలో వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది.భూ వివాదాలపై కోర్టుల్లో ఉండటం, కోర్టు తీర్పులో సర్వే నంబర్ ని భూమి మొత్తానికి వర్తించే సాంకేతిక పరమైన ఇబ్బందులను అధికారులు గుర్తించారు.మొత్తం మీద ధరణితో తలెత్తుతున్న సమస్యలతోపాటు, ఆయా ప్రాంతాల్లోని రైతుల భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 100 బందాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
మూడు రోజులకో మండలం చోప్పున, జాయింట్ కలెక్టర్, డీఆర్ వో, ఆర్డీవోల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో, ధరణి పోర్టల్ ఏ మేరకు సేవలను అందిస్తుందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు కాంగ్రెస్ నేతలు.కాగా మండలాల్లో నిర్వహించే ఈ సదస్సుకు స్థానిక ఎమ్మెల్యే కూడా అధ్యక్షత వహిస్తారని తెలుస్తుంది.