పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం వకీల్ సాబ్.ఈ సినిమా హిందీ పింక్ చిత్రానికి రీమేక్ చిత్రంగా తెరకెక్కింది.
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా థియేటర్ లో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా అమెజాన్ ప్రైమ్ లో కూడా ఎంతో మంచి ఆదరణ దక్కించుకుంది.
ఇలా థియేటర్లలోనూ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా మంచి ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీతెలుగు కొనుగోలు చేశారు.
ఈ సినిమా జీ తెలుగులో మొదటిసారిగా ప్రసారమయి ఏకంగా 19.12 సాలిడ్ రేటింగ్ ను సొంతం చేసుకుంది ఇలా ఈ స్థాయిలో రేటింగ్ రాబట్టడం అంటే మాటలు కాదు.పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ బెస్ట్ రేటింగ్ సినిమాగా వకీల్ సాబ్ రికార్డు దక్కించుకుంది.
ఈ విధంగా గత ఏడాది ఏప్రిల్ 14వ తేదీ థియేటర్ లో విడుదలైన ఈ సినిమా కరోనా కారణం వల్ల కేవలం 15 రోజుల పాటు మాత్రమే థియేటర్లో ప్రసారమైంది.ఈ విధంగా థియేటర్ లో ఈ సినిమాని చూడలేని వారు టీవీలో చూసి ఆనందించారు.

కేవలం థియేటర్లలో 15 రోజుల పాటు ప్రదర్శితమైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సృష్టించింది.ఈ విధంగా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను సృష్టించిన ఈ సినిమాకు తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది.ఈ చిత్రం తాజాగా ఓ అవార్డుని గెలుచుకుంది.వకీల్ సాబ్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు చేసిన మార్కెటింగ్ క్యాంపెయిన్ కి ఇండియన్ మార్కెటింగ్ అవార్డ్స్‌లో భాగంగా జీ తెలుగు ఉత్తమ అనుభవపూర్వక మార్కెటింగ్ కేటగిరిలో ఈ సినిమా బ్రోన్జ్ అవార్డ్‌ని గెలుచుకుంది.
ఇక ఈ విషయాన్ని జీతెలుగు అధికారక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.







