బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలిసిందే.బాహుబలి 1 సినిమా చూసిన తర్వాత బాహుబలి 2 చూడటానికి కుతూహలం పెంచింది కట్టప్ప పాత్రే.
బాహుబలి సినిమాలో బల్లాల దేవుడు, బాహుబలి తరువాత అంతటి గుర్తింపు సంపాదించుకున్న పాత్ర కట్టప్ప.ఇది ఇలా ఉంటే దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం అందరికి తెలిసిందే.
ఇందులో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది.ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు.
భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో అంజలి సునీల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో హీరో శ్రీకాంత్ పాత్ర చాలా ప్రధానం అని చెప్పవచ్చు.ఎందుకంటే ఈ సినిమాలో శ్రీకాంత్ పాత్ర బాహుబలిలో కట్టప్ప స్థాయిలో ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో శ్రీకాంత్ ద్విపాత్ర అభినయంలో చేస్తున్న విషయం తెలిసిందే.తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు .చరణ్ తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో రాగా, చరణ్ శ్రీకాంత్ ఇద్దరు ప్రాణ స్నేహితులు.ఇద్దరూ కలిసే పార్టీ కోసం పని చేస్తూ ఉంటారు.
అలా చివరికి రామ్ చరణ్ కి శ్రీకాంత్ వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి గా మారతాడు.

ఈ నేపథ్యంలోనే కథ ఏ విధంగా మలుపు తిరగబోతోంది అన్నది అసలైన కథ.మొత్తానికి హీరో శ్రీకాంత్ బాహుబలి సినిమా లో కట్టప్ప లాంటి పాత్రను పోషించబోతున్నారు.ఇందులో విలన్ గా ఎస్ జె సూర్య నటిస్తున్నాడు.
ఇక ఇందులో సూర్య కి, శ్రీకాంత్ కి లింక్ ఉంటుంది.శ్రీకాంత్ ఇంతకుముందు హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు.
ఈ మధ్యకాలంలో ఎక్కువగా విలన్ పాత్రలు చేయడానికి మొగ్గు చూపుతున్నాడు శ్రీకాంత్.ఈ ఏడాది విడుదలైన అఖండ సినిమాలో విలన్ గా నటించి సూపర్ హిట్ టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే.







