సాధారణంగా చదువులో ఒకసారి ఫెయిల్ అయితే ఎక్కువమంది నిరాశకు లోనవుతారు.తమకు చదువు రాదని తాము కెరీర్ పరంగా సక్సెస్ సాధించలేమని ఎక్కువమంది భావిస్తారు.
అయితే ఒక యువతి మాత్రం పది, ఇంటర్ ఫెయిల్ అయినా 22 సంవత్సరాలకే ఐఏఎస్ అయ్యారు.ఆమె సక్సెస్ స్టోరీ గురించి తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఆమె టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
చదువులో ఒకప్పుడు ఫెయిలైనా 22 సంవత్సరాలకే ఐఏఎస్( IAS ) అయ్యి అంజు శర్మ( IAS Anju Sharma ) ఇతరులలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు.
అంజు శర్మ ఎప్పుడూ చలాకీగా ఉండేవారు.స్నేహితులతో, బంధువులతో కలిసిమెలిసి ఉండేవారు.బాల్యంలో అంజుశర్మ చదువుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు.అందువల్ల ఆమె పరీక్షల్లో ఫెయిలైనా ఆమె స్నేహితులు కానీ బంధువులు కానీ ఎక్కువగా ఆశ్చర్యపోలేదు.
సైన్స్ అంటే అంజుకు చిన్నప్పటి నుండి భయం కాగా ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నా అంజుకు ఫెయిల్యూర్స్ తప్పలేదు.ఇంటర్ లో ఎకనామిక్స్ లో ఫెయిలైన అంజు తాను పరీక్షల్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాననే ప్రశ్నకు సమాధానం వెతుక్కున్నారు.ఆ తర్వాత బాగా చదివి డిగ్రీలో గోల్డ్ మెడల్( Degree Gold Medalist ) సాధించిన అంజు ఎంబీఏ చదివే సమయంలో సివిల్స్ పై( Civils ) దృష్టి పెట్టారు.
1990 సంవత్సరంలో విడుదలైన సివిల్స్ ఫలితాల్లో అంజుశర్మ సత్తా చాటారు.తొలి ప్రయత్నంలోనే సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించారు.జీవితంలో ఎదురైన ఓటములను సక్సెస్ కు పునాదిగా ఆమె మార్చుకున్నారు.
అసిస్టెంట్ కలెక్టర్ గా ప్రయాణాన్ని మొదలుపెట్టిన అంజు 1990 ఐఏఎస్ టాప్ స్కోరర్లలో ఒకరిగా నిలిచారు.సంకల్పం, ఏకాగ్రతతో ప్రయత్నిస్తే సక్సెస్ సాధించడం కష్టం కాదని అంజు శర్మ ప్రూవ్ చేశారు.
అంజు శర్మ తన సక్సెస్ తో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.అంజు శర్మ కెరీర్ పరంగా ఎదిగిన తీరును చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.