అంజనా దేవి అహల్య కూతురా? అయినా కన్నబిడ్డనే ఎందుకు శపించింది?

ఆంజనేయ స్వామి తల్లి అయిన అంజనా దేవి… జన్మ వృత్తాంతం గురించి విచిత్ర రామాయణంలో వివరించిబడింది.అహల్య, గౌతమ ముని కూతురే అంజనా దేవి.

అయితే ఎంతో అందగత్తె అయిన అహల్య దేవి వద్దకు సూర్యుడు.గౌతముడు లేని సమయంలో వచ్చాడు.

ఆయన తేజస్సుకు అహల్య చూపు కోల్పోయింది.అలా అహల్యకు సూర్యుడి వల్ల ఓ కుమారుడు జన్మించాడు.

ఆ తర్వాత కొన్నాళ్లకు మరొక కుమారుడు జన్మించాడు.ఈ విషయం తెలియని గౌతముడు కుమారులను భుజాలపై ఎత్తుకొని.

Advertisement

కూతురైన అంజనా దేవిని నడిపించుకుంటూ సముద్ర తీరం వద్ద తిరుగుతున్నాడు.అంజనా దేవికి కాళ్లు నొప్పులు పుట్టడంతో… నీ కన్న కూతురిని నడిపించి తీసుకెళ్తూ… పరుల బిడ్డలను భుజాలపై ఎత్తుకుంటావా? అని ప్రశ్నించిందట.దీంతో కోపోద్రిక్తుడైన గౌతమ ముని.

మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానరు ముఖాలు గాక అని శపించి వారిని సముద్రంలోకి తోసేశాడట.ఆ పిల్లలే వాళి, సుగ్రీవులుగా మారారని పురాణాలు చెబుతున్నాయి.

ఈ విషయం తెలుసుకున్న అహల్య… కన్న కూతురే తన గుట్టు బయట పెట్టినందుకు అంజనా దేవిని శపించిందట.

నీకు వానరుడే కుమారుడుగా పుట్టాలని అందంట.అలా అంజనా దేవికి, కేసరికి వాయు దేవుడి అంశతో పుట్టిన వాడే ఆంజనేయ స్వామి.కానీ మామూలు రామాయణ కథలో మాత్రం అంజనా దేవి వానరుడైన కుంజరుడి కూతురని ఉంది.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
ఒత్తిడి త్వ‌ర‌గా త‌గ్గించే సులభ ఉపాయాలు.. ఆచరిస్తే బ్ర‌హ్మాండ‌మైన ప్ర‌యోజ‌నం

ఏది ఏమైనప్పటికీ.భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ.

Advertisement

ఎంతో ధైర్యాన్ని అందించే అంజన్నను మాత్రం అందించిన మహా సాధ్వి అంజనా దేవి.

తాజా వార్తలు