దీపావళి హారతులు.. లక్ష్మీ పూజ చేయడానికి సరైన సమయం ఇదే!

హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే ఎన్నో పండుగలలో దీపావళి పండుగ ఒకటి. దీపావళి పండుగ రోజు హిందూ ప్రజలు లక్ష్మీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు.

 This Is The Perfect Time To Lakshmi Puja And Pavali Harathi Lakshmi Puja, Pavali-TeluguStop.com

ఈ క్రమంలోనే చాలామంది దీపావళి పండుగకు నోములు కూడా పెడుతుంటారు.కొన్ని ప్రాంతాలలో ఐదు రోజులు మరికొన్ని ప్రాంతాలలో మూడు రోజులపాటు జరుపుకునే దీపావళి పండుగను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు.

మరి ఈ ఏడాది దీపావళి పండుగ ఎప్పుడు దీపావళి పండుగ రోజు హారతి ఇవ్వడానికి, లక్ష్మీ పూజ చేయడానికి అనువైన సమయం ఏది అనే విషయానికి వస్తే.

నవంబర్ మూడవ తేదీన నరకచతుర్దశి జరుపుకుంటారు.

ఆశ్వీయుజ బహుళ చతుర్ధశి, బుధవారం రోజు “నరక చతుర్ధశి” పండగ ఈ రోజు మంగళ స్నానాలు ఆచరించి ఉదయం 9 గంటల నుండి 10 గంటల లోపు గురు హోరలో హారతులు  తీసుకోవడానికి ఎంతో అనువైన సమయం.ఇక దీపావళి పండుగ రోజు అమ్మవారికి పూజలు జరుపుకోవడానికి 4వ తేదీ ఉదయం8 నుంచి 9.56లోగా పూజలు చేసుకోవాలి.అలాగే సాయంత్రం 3:18 నుంచి 10:30 వరకు అమ్మవారికి పూజలు చేయడానికి ఎంతో శుభ సమయంగా పరిగణించారు.

దీపావళి పండుగ రోజు చాలా మంది నోములు చేస్తూ ఉంటారు.అయితే గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల నోములు చేయనివారు ఈ ఏడాది నోములు చేయడానికి ఎంతో మంచి రోజని చెప్పవచ్చు.నూతనంగా పెళ్లి జరిగిన దంపతులు, గతంలో నోములు కలిసి రానివారు ఈ ఏడాది నోములు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.ఇలా అమ్మవారి పూజ తర్వాత నోములు పూర్తయిన తర్వాత పండుగ రోజు మన స్థాయి కొద్ది ఇతరులకు బహుమతులు ఇవ్వడం మంచి ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube