మరో మాస్టర్ పీస్ సిద్ధం చేసిన అనిల్ రావిపూడి.. మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా?

మన టాలీవుడ్ లో యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ లలో అనిల్ రావిపూడి ఒకరు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

ప్రెసెంట్ అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.

మే 27న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాడు దిల్ రాజు.ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ హీరోలుగా నటించగా మెహ్రీన్, తమన్నా హీరోయిన్ లుగా నటించారు.

ఇక ఈ సినిమా తర్వాత అనిల్ బాలయ్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈయన గత సినిమా మహేష్ బాబుతో చేసాడు.

Advertisement

ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలుసు.మహేష్ కెరీర్ లో కూడా భారీ వసూళ్లు అందుకుంది.

ఈ సినిమాలో అనిల్ మార్క్ కామెడీ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బాగా ఎలివేట్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.ఈ సినిమా హిట్ తర్వాత మహేష్ బాబు, అనిల్ రావిపూడి మంచి స్నేహితులు అయ్యారు.

ఇక ఇప్పుడు వీరి కాంబో మరోసారి రిపీట్ అవ్వబోతుంది అంటే అవుననే అంటున్నారు సినీ వర్గాలు.అనిల్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మహేష్ గురించి తెలిపాడు.మరోసారి ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నట్టు చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉనాన్రు.

సూపర్ స్టార్ కోసం మంచి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను.అన్ని కమిట్ మేట్స్ పూర్తి చేసి ఈ సినిమా చేద్దాం అని మహేష్ చెప్పగానే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అని తెలిపాడు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

ఈలోపు స్క్రిప్ట్ పూర్తి చేసి సిద్ధంగా ఉండాలి అని చెప్పుకొచ్చాడు అనిల్..

Advertisement

తాజా వార్తలు