తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో( BRS MLC Kavitha ) ఆమె భర్త అనిల్( Anil ) ములాఖత్ లో కలిశారు.ఈ మేరకు కవిత యోగక్షేమాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా ధైర్యంగా ఉండాలని కవితకు భర్త అనిల్ చెప్పారని తెలుస్తోంది.దీనిపై కవిత తాను ధైర్యంగా ఉన్నానని, పిల్లలు తనపై బెంగ పెట్టుకోకుండా చూడాలని ఆమె భర్తకు సూచించారని సమాచారం.
మరోవైపు వచ్చే నెల ఒకటిన కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై( Interim Bail Petition ) విచారణ జరగనుందన్న సంగతి తెలిసిందే.అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయగా.
ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.