సీఎంఆర్ఎఫ్ చెక్కుల వ్యవహారం( CMRF Cheques )లో నిందితులను పోలీసులు రిమాండ్ కు తరలించారు.ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురిని నిందితులుగా చేర్చారు.
సీఎంఆర్ఎష్ కేసులో కీలక సూత్రధారిగా నరేశ్( Naresh ) ఉన్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు.ఈ క్రమంలోనే నరేశ్ తో పాటు వంశీ, ఓంకార్, వెంకటేశ్ ను రిమాండ్ కు తరలించారు.
కాగా పేదల వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి( CM Fund Relief ) కింద మంజూరైన చెక్కుల వ్యవహారంలో గోల్ మాల్ జరిగిన సంగతి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.లబ్ధిదారులకు అందాల్సిన చెక్కులను సీఎంఆర్ఎఫ్ వింగ్ లో పనిచేసే ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు.