కోతుల నుంచి మన ఇళ్లను, మన చుట్టుపక్కల పరిసరాలను, అలాగే పంట పొలాలను కాపాడుకోవడానికి అనేక పద్ధతులను మనం పాటిస్తూనే ఉంటాం.అయినా కానీ కొన్నిసార్లు కోతులు చేయాల్సిన నాశనాన్ని చేసేసి వెళ్తుంటాయి.
అయితే తాజాగా ఓ మహిళ చేసిన పరిష్కారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తెలంగాణ రాష్ట్రం మోరంపల్లి బంజర్ గ్రామ పంచాయతీలో( Morampally Banjar Gram Panchayat ) ఉన్న కోతుల సమస్యను పరిష్కరించేందుకు ఏకంగా గొరిల్లా దుస్తులను( Gorilla Costume ) వేసుకొని కోతులను భయపడేంచే విధంగా తయారైంది పరిస్థితి.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
తెలంగాణలోని కొత్తగూడెం జిల్లాలో( Kothagudem District ) బూర్గంపహాడ్ మండలంలోని మోరంపల్లి బంజర్ గ్రామ పంచాయతీలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
గ్రామపంచాయతీలోని అనేక ఇళ్ల దగ్గర కోతులు( Monkeys ) సంచరిస్తూ మొక్కలను ద్వంస్వం చేయడం, అలాగే తినుబండారంలను నాశనం చేయడం వాటితో పాటు వారి వ్యవసాయం పొలాల్లోని పంటలను కూడా నాశనం చేయడంతో పంచాయతీ ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు.అయితే కోతులను తరిమికొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేసిన అవి విఫలమయ్యాయి.

దానితో వారు వారి గ్రామపంచాయతీ కార్యదర్శి బెండు భవాని కి( Bendu Bhavani ) కూడా ఓ మహిళ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.ఆయనకానీ వారి దగ్గర నుంచి ఎటువంటి పరిష్కారం లభించలేదు.దాంతో ఆవిడ వెంటనే యూట్యూబ్ లో ఈ విషయం సంబంధించి ఒక పరిష్కారాన్ని కనిపెట్టింది.అందులో భాగంగానే ఆవిడ ఆన్లైన్లో గోరిళ్ళ దుస్తులను కొనుగోలు చేసింది.దాంతో గొరిల్లా డ్రెస్సును గ్రామపంచాయతీ సిబ్బందిని ధరించేలా చేసి రోజుకి రెండుసార్లు గ్రామంలోని పొలాల్లోకి అలాగే సమీపంలో ఉన్న అడవుల్లోకి వారిని తిరిగేలా చేసింది.దాంతో కోతులు గొరిల్లా వేషంలో ఉన్న మనిషికి భయపడి సమీపంలోని అడవుల్లోకి పారిపోయాయి.

ఇందుకు సంబంధించి ఆ మహిళ మీడియాతో మాట్లాడుతూ.గత వారం రోజులుగా ఈ ఆలోచన అమలు చేస్తున్నామని., ఇది గ్రామస్తులకు ఉపశయనం కలిగించిందని ఆవిడ తెలిపారు.ఈ గొరిల్లా గెటప్ వల్ల చాలా వరకు కోతులు గ్రామాన్ని విడిచిపెట్టి పోయాయని., ప్రస్తుతం గ్రామంలో చాలా కొన్ని కోతులు మాత్రం మిగిలాయని ఆవిడ చెప్పుకొచ్చింది.ఈ సమస్య ఉన్నప్పుడు గ్రామపంచాయతీ కార్మికులకు గొరిల్లా దుస్తులను ధరించి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కోతులు ఉండే ప్రాంతాల్లో.
, అలాగే సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఉండేలా చూసావని దాంతో అవి ఊరి నుంచి వెళ్ళిపోయినట్లు ఆవిడ తెలిపింది.







