ఆనం రామనారాయణ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డ అనిల్ కుమార్ యాదవ్..

మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని వ్యక్తి తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో సీటు ఇవ్వకపోయి ఉంటే రాజకీయ జీవితం ఎప్పుడో ఆగిపోయి ఉండేదని ఎద్దేవా చేశారు.వైసీపీలో నుంచి వెళ్లిపోవాలని స్కెచ్ లు గీసుకున్న తర్వాత పార్టీపై ఆరోపణలు చేయడం దారుణం అన్నారు.

నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలని ఆనం, నారాయణలు ప్రయత్నిస్తున్నారని, ఎవరు వచ్చినా తన గెలుపును, వైసిపి అధికారాన్ని అడ్డుకోలేరని అనిల్ అన్నారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు