వైరల్: ఎద్దుతో పరాచికాలా? అలాగే జరుగుతుంది.. అనుభవించండి!

రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే ఎద్దులు, ఆవులు మనుషులపై ఎంత ఘోరంగా దాడి చేస్తాయో మనం చూస్తూనే ఉన్నాం.ఎద్దుల దాడులకు( Bull Attacks ) సంబంధించి సోషల్ మీడియాలో తరచుగా వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

 Angry Bull Attacks Woman Video Viral On Social Media Details, Viral Video, Viral-TeluguStop.com

వీడియోలను చూసి చాలామంది భయపడిపోతున్నారు.వీటికి దూరంగా ఉండాలి అని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వీటి దాడులు భారతదేశ వరకే పరిమితం కాలేదు.ప్రపంచవ్యాప్తంగా ఎద్దుల వల్ల చాలామంది గాయాల పాలవుతున్నారు.

వాటి నుంచి ప్రాణాపాయం ఉందని తెలిసినా కొందరు మాత్రం వాటిని గిల్లుకొని మరీ చివరికి ఆసుపత్రికి పాలవుతున్నారు.తాజాగా ఒక యువతి( Woman ) కూడా అనవసరంగా ఒక ఎద్దును రెచ్చగొట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.

ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో @earth.reel అనే హ్యాండిల్‌లో ఆ యువతికి సంబంధించిన వీడియో పోస్ట్ చేసింది.అందులో సదరు యువతి ఓ చిన్న వస్త్రపు మొక్క పట్టుకొని ఎద్దు వైపు చూపిస్తూ దానిని బాగా రెచ్చగొట్టింది.ఆ ఎద్దు ( Bull )చాలా పెద్దగా ఉంది.

అది నన్నేం చేస్తుందిలే అన్నట్లు ఈ యువతి దాన్ని మరింత ఆగ్రహానికి గురిచేసింది.దాంతో ఎద్దు యువతి వైపు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి దాని భారీ కొమ్ములతో పైకి ఎత్తి కుదేసింది.ఆ దెబ్బకు సదరు యువతి నేలపై నుంచి లేవలేకపోయింది.

అప్పటికే ఆమెకు బాగానే గాయాలైనట్లు తెలిసింది.అదృష్టం కొద్దీ సదరు ఎద్దు ఆమె యువతిపై పెద్దగా మరింత దాడి చేయకుండా వదిలేసిందే లేకపోతే ఆమె ప్రాణాలు పోయి ఉండేవి.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎద్దులతో పెట్టుకుంటే ఇలానే ఉంటది మరి అని కామెంట్ చేస్తున్నారు.

ఈ దాడికి ఆమె మూర్ఖత్వమే కారణమని మరికొందరు తిట్టిపోస్తున్నారు.వీటితో పరాచికాలు ఆడితే ఇలా ఎవరైనా సరే అనుభవించాల్సిందే అని కామెంట్ చేస్తున్నారు.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube