మాస్ మహారాజా రవితేజ( Raviteja ) – గోపీచంద్ మలినేని కాంబో మరోసారి అఫిషియల్ అయిన విషయం తెలిసిందే.గోపీచంద్ మలినేని( Gopichand Malineni )తో రవితేజ కొత్త మూవీ ఇటీవలే అనౌన్స్ చేసారు.
మైత్రి మూవీస్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నట్టు కూడా ప్రకటించారు.
అంతేకాదు మాసెస్ట్ కాంబో అంటూ పోస్టర్ రిలీజ్ చేయగా ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది.
ఇక అప్పటి నుండి ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూసే వారికీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ తెలుస్తుంది.మేకర్స్ ఒక్కొక్క పని పూర్తి చేస్తున్నట్టు అనిపిస్తుంది.
ఇటీవలే ఈ సినిమాలో హీరోయిన్ ను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి.మాస్ రాజా సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే( Pooja Hegde )ను సెట్ చేయాలని చూస్తున్నారు.
ఆమె కూడా ఒప్పుకున్నట్టే టాక్ వచ్చింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ గురించిన అప్డేట్ ఒకటి తెలుస్తుంది.
మాస్ రాజా మాస్ కాంబో షూట్ ను సెప్టెంబర్ నుండి స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.రవితేజ ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswar Rao ) చేస్తుండగా ఈ మూవీ అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది.
అలాగే ఇటీవలే దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగల్'( Eagle ) సినిమా ప్రకటించాడు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది 2024 సంక్రాంతి టార్గెట్ గా రిలీజ్ కాబోతుంది.అలాగే దీంతో పాటు గోపీచంద్ మలినేని సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు.మరి టైగర్ పూర్తి అవ్వడంతో వెంటనే మరో ప్రాజెక్ట్ లైన్లో పెట్టనున్నాడు మాస్ రాజా.
ఎంతైనా ఈయన స్పీడ్ మరే హీరో కూడా బీట్ చేయలేరు అనే చెప్పాలి.