ప్రస్తుత సమాజంలో చాలా మంది అధిక బరువు సమస్య( Obesity )తో ఇబ్బంది పడుతున్నారు.డైటింగ్ అని చెప్పి కొన్ని రకాల నూనె ఆహార పదార్థాలను తినకుండా ఉంటున్నారు.
అయినా కానీ కొంతమంది అసలు బరువు తగ్గడం లేదు.పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా ఉంటే అందానికే కాదు ఆరోగ్యానికి కూడా హానికరమే.
దీనివల్ల అధిక రక్తపోటు, షుగర్, క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.కాబట్టి కొవ్వును తగ్గించుకోవడానికి ఇప్పుడు ఉన్న పద్ధతుల గురించి తెలుసుకుందాం.
మన ఒంట్లో ఉన్న కొవ్వు తొందరగా తగ్గాలంటే మనం తీసుకునే ఆహారంలో 10 గ్రాముల పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి.
అధిక నీటితోపాటు ఎక్కువగా పీచు పదార్థాలను తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు రాకుండా ఉంటాయి.అలాగే రోజుకు 100 గ్రాములకు ప్రోటీన్స్ అందెలా చూసుకోవాలి.కొద్దిగా వేడి నీళ్లలో కాస్త నిమ్మ రసాన్ని( Lemon Juice ) కలుపుకొని తాగడం వల్ల అధిక కొవ్వు తగ్గిపోతుంది.
అలాగే కొద్దిగా వేడి నీళ్లలో నిమ్మరసం, తేనె, జిలకర కలిపి తాగితే పొట్ట కూడా తగ్గిపోతుంది.అయితే ఈ నీళ్లు తాగిన అరగంట వరకు ఏమి తినకూడదు.ఇలా వారం రోజులు తాగితే శరీరంలోని కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది
ఒక గిన్నెలో నీరు పోసి స్టవ్ మీద పెట్టి దాంట్లో కొన్ని క్యాబేజీ ముక్కలు, క్యారెట్ ముక్కలు( Carrots ), ఉప్పు వేసి ఉడికించి చల్లారిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర పొడి వేసి కలుపుకొని వారం రోజులు పాటు తినాలి.దీనివల్ల పొట్ట చుట్టూ కొవ్వు కరిగిపోతుంది.వెల్లుల్లిని ఉదయాన్నే తిని నీరు తాగడం వల్ల దానిలోని ఫ్రీ రాట్ సెల్స్ కొవ్వుని తగ్గిస్తాయి.ఒక గిన్నెలో నీరు పోసి స్టవ్ మీద పెట్టి దాంట్లో నీళ్లు పోసి అల్లం ముక్కలు( Ginger ) వేసి బాగా మరగపెట్టాలి.
ఇప్పుడు ఆ నీటిలో కాస్త నిమ్మరసం తేనె కలుపుకొని ప్రతి రోజూ నెల రోజులపాటు తాగాలి.ఇలా చేయడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా తగ్గిపోతుంది.