నీటిపారుదల శాఖ క్యాంప్‌ ఆఫీస్‌లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ అంబటి రాంబాబు ప్రెస్‌మీట్‌

తప్పుకోవడానికి ఇదేమైనా హెరిటేజ్‌ పాల ఫ్యాక్టరీనా? లేక ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనా? బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రినా?మేం తప్పుకుంటే.చంద్రబాబు రావడానికి? ఇది ప్రజాస్వామ్యం.

ప్రజలు అధికారం ఇచ్చారు.

చంద్రబాబు గతి తప్పి పిచ్చిగా మాట్లాడుతున్నారు.రాష్ట్ర మంత్రి శ్రీ అంబటి రాంబాబు స్పష్టీకరణ.

మరి నీకూ ఆ అధికారం ఇచ్చారు కదా? ఏం చేశావు? 5 ఏళ్లు సీఎంగా ఉండి పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేదుబస్సుల్లో ప్రజలను తీసుకుపోయి, భజన చేయించుకున్నావు.మళ్లీ వస్తే వెలుగు చూపిస్తానని మరో మాట అంటున్నావు.

నీ గత 5 ఏళ్ల పాలనతో ఎన్ని వెలుగులు చూపావు? సూటిగా ప్రశ్నించిన మంత్రి శ్రీ అంబటి రాంబాబు2018 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నారు.కాఫర్‌ డ్యామ్‌ కట్టకుండా డయాఫ్రమ్‌ వాల్‌ కట్టడం సరైన పనేనా? అది సెంట్రింగ్‌ లేకుండానే శ్లాబ్‌ పోసినట్లు కాదా?ముందు ఈ రెండింటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి.ఆ తర్వాతే ప్రాజెక్టు గురించి మాట్లాడాలి.

Advertisement

చంద్రబాబుకు మంత్రి శ్రీ అంబటి సవాల్‌పోలవరం ప్రాజెక్టు పనులకు చంద్రబాబే శాపం ఆయన నిర్వాకం వల్లనే పనుల్లో ఈ జాప్యం అయినా ఇప్పుడు అర్ధం లేని విమర్శల పర్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, నీళ్లిస్తాం మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది.ప్రెస్‌మీట్‌లో మంత్రి శ్రీ అంబటి రాంబాబు వెల్లడి విజయవాడ.

ప్రెస్‌మీట్‌లో మంత్రి శ్రీ అంబటి రాంబాబు ఏం మాట్లాడారంటే.:

ప్రతిపక్షనేతకు కడుపుమంట:

గోదావరికే కాకుండా అన్ని నదులకు నీళ్లు వచ్చాయి.అయితే ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా గోదావరికి ఎక్కువ వరద వచ్చింది.

నది పొంగి పొర్లింది.చాలా గ్రామాలను ముంచెత్తింది.

భారీగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.ప్రభుత్వం సాధ్యమైనంత వరకు ఆదుకుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

యంత్రాంగమంతా కలిసి పని చేసింది.ప్రజలకు అండగా నిలబడింది దీంతో వరద బాధితులంతా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ను, ప్రభుత్వాన్ని అభినందించారు.

Advertisement

దాంతో ప్రతిపక్షనేతలో కడుపు మంట ఎక్కువైంది.

ఆయనతోనే కరువు.

వరదలు:

తొలుత వరద ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.సీఎం హెలికాప్టర్‌లోనే తిరుగుతాడని, ప్రజలకు ఏమీ అందలేదు కాబట్టి, నిలదీయాలని కోరారు.

తాను అందరి కంటే ముందుగా వచ్చానని అన్నాడు.తాను ఎప్పుడైనా వరదల కంటే, గాలివాన కంటే ముందే వస్తానని చెప్పాడు.

నిజమే అది రివర్స్‌.ఎందుకంటే ఆయన వస్తే కరువు వస్తుంది.

వరదలు వస్తాయి.గాలివాన వస్తుంది.

అలా ఆయన పర్యటనలో విషం కక్కిన చంద్రబాబు, ప్రజలను రెచ్చగొట్టాలని చాలా ప్రయత్నించి, తిరిగి వచ్చాడు.

సీఎం పర్యటన:

ఆ తర్వాత సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ పర్యటించారు.సహాయ కార్యక్రమాలు జరుగుతుంటే, తాను వెళ్తే వాటికి ఆటంకం కలుగుతుందని భావించి, అవి పూరై్తన తర్వాతే తాను వెళ్లారు.

ప్రభుత్వం పంపించిన సాయం అందిందా? లేదా? అని ప్రతి చోటా అడిగారు.రూ.2 వేలు అందాయా? సరుకులు తీసుకున్నారా? అని అడగడంతో, ప్రజలంతా ఏక కంఠంతో చెప్పారు.

అర్ధం లేని విమర్శలు:

దీంతో చంద్రబాబుకు మరింత అక్కసు ఎక్కువైంది.ఏమిటి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే, ఎక్కడా ప్రజలు తిరగబడలేదని, సీఎంను తిట్టలేదని, ఆయనమీద బురద చల్లలేదని ఆక్షేపించాడు.

అందుకే జగన్‌గారి పర్యటన ముగియగానే చంద్రబాబు మళ్లీ బయలుదేరాడు.యథావిథిగా జగన్‌గారిపై పిచ్చి విమర్శలు.రాజకీయాలు.

కోడికత్తి కమలహసన్‌ అంట.చంద్రబాబుకు కమలహసన్‌ గురించి ఏం తెలుసు?.మరి భారతీయుడు సినిమాలో కూడా కమలహసన్‌ ఉన్నాడు.

అందులో ఆయన దుర్మార్గులు, దుష్టులతో పాటు చంద్రబాబు వంటి ఫోర్‌ట్వంటీగాళ్ల గొంతు కోశాడు.అలాంటి కమలహసన్‌ జగన్‌గారు అని ప్రజలు చెబుతున్నారు.వరదలు రాగానే వెంటనే రూ.2 వేలు ఇచ్చిన సందర్భం గతంలో ఎప్పుడైనా ఉందా? అలా చంద్రబాబు ఏనాడైనా ఇచ్చాడా?.ఏమన్నా అంటే, హుద్‌హుద్‌ తుపాన్‌ వచ్చినప్పుడు విశాఖ వెళ్లి బస్సులోనే ఉన్నానంటాడు.

అలాగే గోదావరి పుష్కరాలకు వెళ్లాడు.బురద రాసుకున్నాడు.

స్నానం చేశాడు.ప్రజలను చాలా సేపు ఎదురుచూసేలా చేశాడు.

దీంతో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోవడానికి కారణమయ్యాడు.

దిక్కు తోచక పిచ్చి మాటలు:

తాజాగా చంద్రబాబు భద్రాచలం దగ్గర కొన్ని గ్రామాలకు వెళ్లాడు.పోలవరం కింద మునిగిపోతున్న ప్రాంతాలు సందర్శించాడు.

అక్కడికి పోయి ఏం మాట్లాడుతున్నాడు.భద్రాచలం వద్ద కరకట్టను 1986లో తానే కట్టానని అంటున్నాడు.

నాకు తెలిసి, అప్పుడు కనీసం ఎమ్మెల్యేగా కూడా లేడు.అయితే తాను అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నానని, ఆ కట్టను తానే కట్టానని చెబుతున్నాడు.

ఈ విషయం ఆయనకు అక్కడి వారు గుర్తు చేశారట.నిజానికి భద్రాచలంలో కరకట్ట కట్టింది అప్పటి సీఎం ఎన్టీ రామారావు.

కడుపుమంట మరింత పెరిగి చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నాడు.ఎందుకంటే ఏం చేసినా, తాను మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.

చంద్రబాబుకు మిగిలింది అదే:

తాజాగా ఇండియా టుడే సర్వే కూడా అదే తేల్చింది.దీంతో దిక్కు తోచని చంద్రబాబు, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌పై పిచ్చి విమర్శలు చేస్తున్నారు.

సీఎంగారు హెలికాప్టర్‌లో తిరుగుతున్నారని, ఆయన వస్తే, బారికేడ్లు కడుతున్నారని అంటున్నారు.సీఎం భద్రత కోసం అలా చేస్తారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హెలికాప్టర్‌లో కాకుండా నడిచి తిరిగాడా? ఇప్పుడు ఆయనకు ఏం పని లేదు.రోడ్లపై తిరుగుతున్నాడు.

ఇక చంద్రబాబుకు మిగిలింది అదే.

ఇదేమైనా హెరిటేజ్‌ పాల ఫ్యాక్టరీనా?:

చంద్రబాబు తప్పిదాల వల్ల పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోవడం, అక్కడ పనులు ఆలస్యం కావడంపై అనేకసార్లు నేను చెప్పాను.అయినా విచిత్రంగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు.

పోలవరంలో వి«ధ్వంసం జరిగిందని, ప్రాజెక్టు సర్వనాశనం అయిందని, సీఎం చేతులెత్తేశాడని.అందుకే చేతకాని సీఎం ఏమిటి డ్రామాలు? మీరు తప్పుకొండి.నేను చూపిస్తాను అని మాట్లాడుతున్నాడు.

మేం తప్పుకోవాలట.ఆయన చూపిస్తాడట.

ఇదేమన్నా హెరిటేజ్‌ పాల ఫ్యాక్టరీనా? లేక ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనా? లేకపోతే బసవ తారకం క్యాన్సర్‌ ఆస్పత్రినా? మేం తప్పుకుంటే, ఆయన రావడానికి? ఇది ప్రజాస్వామ్యం.ప్రజలు తీర్పు ఇచ్చారు.

మాకు 5 ఏళ్లు అధికారం ఇచ్చారు.అయితే మేము తప్పుకోవాలట.ఆయన ఎక్కుతాడట?

ఆనాడు ఏం చేశావు?:

మరి నీకూ ఆ అధికారం ఇచ్చారు కదా? ఏం చేశావు.5 ఏళ్లు సీఎంగా ఉండి పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేదు.బస్సుల్లో ప్రజలను తీసుకుపోయి, భజన చేయించుకున్నావు.

తాను వస్తే వెలుగు చూపిస్తానని మరో మాట అన్నారు.ఆయన తన 5 ఏళ్ల పాలనతో ఎన్ని వెలుగులు చూపాడు?

ఇదే నా సవాల్‌:

నేను ఇదివరకే అడిగాను.మళ్లీ అడుగుతున్నాను.

– 2018లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానన్న తెలుగుదేశం పార్టీ ఎందుకు పూర్తి చేయలేకపోయింది? ఈ విషయాన్ని స్వయంగా అసెంబ్లీలోనే చెప్పారు.– కాఫర్‌ డ్యామ్‌ కట్టకుండా డయాఫ్రమ్‌ వాల్‌ కట్టడం సరైన పనేనా? ఒక్క మాటలో చెప్పాలంటే సెంట్రింగ్‌ లేకుండా శ్లాబ్‌ పోసినట్లు.ఆ విధంగా ప్రాజెక్టు పనులను సర్వనాశనం చేసిన మీరు.

ఈ రెండింటికి సమాధానం చెప్పాలి.అప్పుడే మాట్లాడాలని సవాల్‌ చేస్తున్నాను.

అసలు ఎందుకు తీసుకున్నావు?:

అసలు ఇవేవీ కావు.పోలవరం ప్రాజెక్టు ఎవరిది? అది జాతీయ ప్రాజెక్టు.దాన్ని కట్టాల్సింది కేంద్రం.

మరి అలాంటప్పుడు నీవు ఎందుకు తీసుకున్నావు? స్వయంగా కడతానని ఎందుకు తీసుకున్నావు? కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును కమిషన్ల కోసం, డబ్బుల కోసం వారి దగ్గరి నుంచి తీసుకుని, పనులను అస్తవ్యస్తం చేశావు.కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేయకుండా డయాఫ్రమ్‌ వాల్‌ కట్టావు.అసలు కేంద్రం నుంచి ప్రాజెక్టును ఎందుకు తీసుకున్నావు? 2018లో పూర్తి చేస్తానని ఎందుకు పూర్తి చేయలేదు? వీటికి నీ దగ్గర సమాధానం ఉందా?

రెండు దశల్లో 45.72 అడుగులకు:

చంద్రబాబు ఇంకో మాట కూడా అంటున్నాడు.జగన్‌గారు ఈ ప్రాజెక్టును 41.15 అడుగులకే ఆపేస్తున్నాడని.ఇది తప్పు.

సీఎంగారు స్వయంగా అసెంబ్లీలో చెప్పారు.ఇది దశల వారీగా పూర్తి చేసే ప్రాజెక్టు.తొలుత 41.15 అడుగుల వరకు కట్టి, దాంట్లో నీరు నింపుతారు.దాన్ని మినిమమ్‌ డ్రా డ్రౌన్‌ లెవెల్‌ (ఎండీడీఎల్‌) అంటారు.ఆ స్థాయిలో కుడి, ఎడమ కాల్వలకు నీళ్లిచ్చి, అన్నీ అధ్యయనం చేసి, పొరపాట్లు ఉంటే అన్నీ సరి చేసిన తర్వాత, 45.72 అడుగుల వరకు ఫుల్‌ రిజర్వాయర్‌ లెవెల్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌)కు తీసుకుపోతారు.ఇది ప్రాజెక్టు కట్టే పద్ధతి.

చంద్రబాబుకు బుర్ర పోయిందా?:

అయినా దీనిపైనా చంద్రబాబు దుష్ప్రచారం.పోలవరం ప్రాజెక్టును 41.15 అడుగులకే పరిమితం చేస్తున్నారని.కాబట్టి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాడు.

తాను పూర్తి చేస్తానంటున్నాడు.చంద్రబాబుగారికి బుర్ర పోయిందో.

లేక ఫ్రస్టేషన్‌లో ఉన్నాడేమో.ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.

చంద్రబాబే కారణం.రుజువు చేస్తా:

ప్రాజెక్టు గురించి అందరూ అడుగుతున్నారు.కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేయకుండా, డయాఫ్రమ్‌ వాల్‌ కట్టడం వల్లనే ఇదంతా జరిగింది.

ఇదే విషయాన్ని ఐఐటీ హైదరాబాద్‌ నిపుణులు కూడా రిపోర్టులో రాశారు.మీకు కావాలంటే ఇస్తాను.

మళ్లీ అదే విషయాన్ని చంద్రబాబు ఇవాళ మాట్లాడుతున్నాడు.రెండు కాఫర్‌డ్యామ్‌ల మధ్య నీరు నిలబడిందని.

అలా ఎందుకు జరిగింది? చంద్రబాబు చేసిన తప్పిదం వల్ల.ఆయన కమిషన్ల కోసం చేసిన కక్కుర్తి పనుల వల్లనే ఇదంతా జరిగింది.

ఇన్ని చేసిన ఆయన పదే పదే మమ్మల్ని విమర్శిస్తున్నాడు.ఆయన ఉద్దేశం ఒకటే.

చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెబితే, ప్రజలు నమ్ముతారు.తాను ఏది చెప్పినా రెండు పత్రికలు రాస్తాయి.

అందుకే ఆయన చెప్పడం.వారు రాయడం.

అలా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు.ఇవాళ పనులకు ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం.

చంద్రబాబు చేసిన తప్పుల వల్ల ప్రాజెక్టు సైట్‌ అంతా మునిగిపోయింది.దీన్ని నేను రుజువు చేస్తాను.

ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ ఫోటోలు ప్రదర్శిస్తాను.అన్నీ వివరిస్తాను.

చంద్రబాబు చెబుతున్నవన్నీ అవాస్తవాలని రుజువు చేస్తాను.

ప్రాజెక్టును కచ్చితంగా పూర్తి చేస్తాం:

ఏది ఏమైనా, మరోసారి చెబుతున్నాను.పోలవరం ప్రాజెక్టును జగన్‌గారు పూర్తి చేస్తారు.

దాంట్లో ఏం సందేహం లేదు.అది జాతీయ ప్రాజెక్టు కాబట్టి, కేంద్రం సహకారంతో అది జరుగుతుంది.

పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)తో నిరంతం సంప్రదిస్తున్నాం.చర్చిస్తున్నాం.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా.

ఎక్కడా అలసత్వం లేదు:

గోదావరి వరదల గురించి హెచ్చరికలు రాగానే, పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాం.ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీఓలు) కూడా సహకరించాలని కోరాం.

లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం.వరద బాధితులకు వెంటనే రూ.2 వేల చొప్పున ఇచ్చాం.రేషన్‌ సరుకులు ఇచ్చాం.

కానీ నాలుగు బంగాళాదుంపలు, నాలుగు ఉల్లిపాయలు మాత్రమే ఇచ్చారని దుష్ప్రచారం చేస్తున్నారు.నిజం చెప్పాలంటే గతంలో ఏనాడూ లేని విధంగా వరద బా«ధితులను ఆదుకున్నాం.

ప్రభుత్వం ఎక్కడా అలసత్వం చూపలేదు.సీఎంగారు వెళ్లి వరద బాధితులను అడిగితే, అందరూ స్పందించారు.

సంతోషం వ్యక్తం చేశారు.

వారిద్దరికే అసంతృప్తి:

ఒక్క చంద్రబాబు, ఆయన కుమారుడు మాత్రమే సంతోషంగా లేరు.నిజం చెప్పాలంటే కులం, మతం, వర్గం, రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్కరికి ఆదుకున్నాం.

తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి కూడా సహాయం చేశాం.

పనుల ఆలస్యానికి చంద్రబాబే కారణం:

2021 ఖరీఫ్‌కు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎంగారు అసెంబ్లీలో చెప్పారు.కానీ పనులు కాలేదు.

కారణం, డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయింది.దానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా,ఏ మళ్లీ వరదలు వచ్చాయి.

ప్రాజెక్టు సైట్‌ అంతా మునిగిపోయింది.దీంతో మళ్లీ పనులు ఆలస్యం అయ్యాయి.

మళ్లీ చెబుతున్నాను.చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లనే ఇదంతా.

కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేయకుండానే, డయాఫ్రమ్‌వాల్‌ కట్టాడు.ఇది ధర్మమేనా? ఎందుకు ఈ పాపం చేశారు? అలాగే 2018 నాటికి పూర్తి చేస్తామని ఎందుకు పూర్తి చేయలేదు? పనులు ఆపాలని కేంద్ర జల సంఘం ఆపలేదు.ప్రజలు కోరారు.

కాఫర్‌డ్యామ్‌లు మూస్తే, మా 45 గ్రామాలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలు ఇచ్చి, ప్రజలను తరలించి, కాఫర్‌డ్యామ్‌లు పూర్తిగా కట్టి, డయాఫ్రమ్‌ వాల్‌ మళ్లీ కట్టాల్సి ఉంది.

చంద్రబాబు అప్పుడేం చేశారు?:

పదే పదే 22 మంది ఎంపీలు రాజీనామా చేయాలంటున్న చంద్రబాబు, తన పాలనలో చాలా కాలం బీజేపీతో కలిసి కేంద్రంలో కూడా అధికారం పంచుకుని, ఆ తర్వాత ఎన్నికలకు ముందు, మోదీతో విభేదించి, కాంగ్రెస్‌తో జత కట్టాడు.మరి అప్పుడు ఏం చేశావు? ఎన్నికల తర్వాత మళ్లీ మోదీకి దగ్గర కావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నావు.తాజాగా బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి అడగకుండానే మద్దతు ఇచ్చి, బెర్ముగారికి ఓటు వేశావు.

మోదీ కాళ్లు పట్టుకుంటున్నావు.

ఇదేనా నీ రాజకీయం?:

అందితే జుట్టు.అందకపోతే కాళ్లు.

ఇదేనా నీ రాజకీయం? ఏం బతుకు? మళ్లీ అధికారంలోకి వస్తే, వెలుగు చూపిస్తాడట.నీవు అధికారంలోకి వచ్చేది లేదు.

నీకు రోడ్ల మీద తిరగడం తప్ప.ఆయనకు వయసు రావడంతో నడుము నొప్పి పెడుతోంది తప్ప, రోడ్ల వల్ల కాదు.

వీలైనంత త్వరగా.:

41.15 అడుగుల స్థాయిలో నీరు నిలబెట్టాలంటే దాదాపు 21 వేల ఇళ్లను తరలించాలి.దాంట్లో ఇప్పటికే 10 వేల ఇళ్లు ఖాళీ చేయించాం.

ఇంకా 3 వేల మంది నగదు కావాలంటున్నారు.ఇంకా మరో దాదాపు 3 వేల మందికి ఇళ్లు తయారవుతున్నాయి.

రాబోయే రోజుల్లో మొత్తం 21 వేల ఇళ్ల మందికి పునరావాసం కల్పించి, ప్రాజెక్టులో నీరు నింపడం జరుగుతుంది.

అందుకు రూ.20 వేల కోట్లు:

ఆ తర్వాత ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టం ఎఫ్‌ఆర్‌ఎల్‌ 45.72 అడుగుల నీరు నింపాలంటే దాదాపు 85 వేల ఇళ్లు ఖాళీ చేయించాల్సి ఉంది.దీనికి సుమారు రూ.20 వేల కోట్లు కావాలి.కేంద్రం ఇస్తేనే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ సాధ్యం.అందుకే తొలుత 41.15 అడుగులకు టేకప్‌ చేసిన తర్వాత, రెండో దశలో 45.72 అడుగులకు పెంచడం జరుగుతుంది.ఇది వాస్తవం ఎందుకంటే 45.75 వరకు డీపీఆర్‌ ఉంది.కాబట్టి తప్పనిసరిగా 45.72 అడుగులతో ప్రాజెక్టు కడతాం.41.15 అడుగుల వరకు నిర్మాణానికి సంబంధించి ఇవ్వాల్సిన ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ వేరు.అది ఇప్పుడు కొనసాగుతోంది.

తాజా వార్తలు