కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా మహారాష్ట్రలో కేసులు అధికంగా బయట పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ ఉన్నారు.

ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటీవల కేసులు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం తీసుకుంది.నిన్న ఒక్కరోజే దాదాపు వెయ్యికి పైగా కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ ఫస్ట్ నుంచి టెస్ట్, ట్రాక్, ట్రీట్ అనే పద్ధతిని అమలు చేయాలని డిసైడ్ అయింది.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ నిర్ధారణ కోసం ఆర్టిపీసీఆర్ టెస్టులను నిర్వహించబోతున్నారు.ముఖ్యంగా కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేయటానికి నిర్ణయం తీసుకుంటూ ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆడుకుంటుంది.

ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలలో ఏ వ్యక్తికి అయితే పాజిటివ్ రిపోర్ట్ వస్తుందో ఆ వ్యక్తితో కాంటాక్ట్ అయిన వారిని 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉంచాలని ప్రభుత్వం తాజాగా సరికొత్త ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ క్రమంలో ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మరియు మాస్క్ ధరించాలి అని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

Advertisement
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

తాజా వార్తలు