రష్మీ, సుధీర్ పెళ్లి జరిపిస్తానంటున్న ప్రముఖ యాంకర్!

బుల్లితెరపై రష్మీ, సుధీర్ కాంబినేషన్ కు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.వీళ్లిద్దరూ ఏ షోలో ఉన్నా ఆ షో సక్సెస్ అవుతుందనే సెంటిమెంట్ ఉంది.

యూట్యూబ్ జోడీగా పేరు తెచ్చుకున్న రష్మీ, సుధీర్ ఒకరినొకరు ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి.సుధీర్ సైతం పలు సందర్భాల్లో టీవీ షోలలో రష్మీని ప్రేమిస్తున్నానని చెప్పాడు.

తాజాగా ఈ యూట్యూబ్ జోడీ మరోసారి వార్తల్లో నిలిచింది. యాంకర్ రవి రష్మీ, సుధీర్ పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

తాజాగా రిలీజైన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో స్కిట్ కోసం రవి షోకు హాజరయ్యాడు.రాకేష్ స్కిట్ లో భాగంగా రష్మీ దగ్గరకు వెళ్లి " ఒకటి చెబుతా ఏమనుకోకు.

Advertisement

షష్టిపూర్తి వయస్సులో శుభకార్యం చేసుకోవాలనుకోవడం తప్పు.ఏంటి ప్రాబ్లమ్.

వాడు ఒప్పుకోవట్లేదా.? నువ్వే ఒప్పుకోవట్లేదంట కదా.? ఒప్పేసుకుంటే ఆ శుభకార్యం జరిపిస్తాను" అంటూ రవి కామెంట్లు చేశాడు.యాంకర్ రవి చేసిన ఆ కామెంట్లకు రష్మీ సిగ్గు పడుతూ మురిసిపోయింది.

దీంతో శుభకార్యం దగ్గర్లోనే ఉందంటూ రవి పంచులు వేశాడు.దీంతో నెటిజన్లు సుధీర్, రష్మీ నిజంగానే పెళ్లి చేసుకుంటారా.? అని మరోసారి చర్చించుకుంటున్నారు.అయితే గతంలోనే రష్మి తనకు సుధీర్ స్నేహితుడు మాత్రమేనని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

సుధీర్ కూడా తాను రష్మిని ప్రేమించడం లేదని వివరణ ఇచ్చాడు.అయితే షో నిర్వాహకులు మాత్రం వీళ్లిద్దరి క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు వీళ్లతో స్కిట్ లు, డ్యాన్సులు చేయిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే30, గురువారం 2024
ఆ సినిమాలు చేసినందుకు నాకేం బాధ లేదు.. కార్తికేయ షాకింగ్ కామెంట్స్ వైరల్!

బుల్లితెరపై కలిసి చేసినా విడిగా చేసినా రష్మీ, సుధీర్ లకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే రష్మీ, సుధీర్ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని పలువురు నెటిజన్లు కామెంట్ల రూపంలో అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు