జాతీయ‌ మీడియా పై డైరెక్టర్‌ హరీష్ ‌శంకర్ ఫైర్...!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత నేషనల్ మీడియా మొత్తం అందుకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తుంది.

అయితే, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా కేసు ప్రస్తుతం ఎన్సిబి అధికారులు విచారణ చేస్తున్నారు.

ఇక ఆ తర్వాత విచారణలో భాగంగా ఈ సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు రియా ను అదుపులోకి తీసుకోవడంతో జాతీయ స్థాయిలో సంచలనం గా మారిపోయింది.ప్రస్తుతం ఈ కేసు నిమిత్తం బాలీవుడ్ లోని టాప్ హీరోయిన్స్ ని విచారణలో తిప్పుతూ జాతీయ మీడియా మొత్తం అదే వైపు కవరేజ్ చేస్తూ కొత్త విషయాలను తెలియజేస్తున్నారు.

అంతే కాకుండా ఈ డ్రగ్ కేసులో ఎవరు ఎంత దందా చేస్తున్నారు, ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయన్న వాటి విషయాలను జాతీయ మీడియా హైలెట్ చేస్తుంది తప్ప ఒక అంతర్జాతీయ గుర్తింపు పొందిన వ్యక్తి గురించి పట్టించుకోలేదని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ జాతీయ మీడియా పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.గాన గంధర్వుడు, గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం శుక్రవారం నాడు మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ విషయం సంబంధించి జాతీయ మీడియాలో ఏదో వార్త చెప్పాలన్న విధంగా చెప్పి వదిలేశారు.బాలసుబ్రహ్మణ్యం గారి పై ఎలాంటి స్పెషల్ స్టోరీ ని ప్లాన్ చేయకుండా అలా వదిలేశారు.

Advertisement

అయితే, అంతర్జాతీయ ఛానల్ అయిన బిబిసి వరల్డ్ మాత్రం బాలు గారి పై ప్రత్యేక కథనాన్ని రూపొందించి లెజెండరీ గాయకుడికి ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నివాళులు అర్పించింది.ఒక భారతదేశ వ్యక్తిని అంతర్జాతీయ మీడియా అంత బాగా కవర్ చేస్తుంది, మన జాతీయ మీడియా మాత్రం ఎలాంటి కవరేజ్ లేకుండా ఏదో తూతూమంత్రంగా వార్తలు అందిస్తుందని హరీష్ శంకర్ నేషనల్ మీడియా పై తన అధికార ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు.

ఇక ఆయన ట్విట్టర్ వేదికగా బిబిసి ప్రసారం చేసిన వీడియోని షేర్ చేస్తూ ఇంటర్నేషనల్ మీడియా కూడా బాలు గురించి ఎంతో అద్భుతంగా ప్రజెంట్ చేసిందో.మన నేషనల్ మీడియా ను చూస్తే జాలేస్తుంది అని తెలిపారు.

దీనితో పాటు అంతేలే కొందరి స్థాయి విశ్వవ్యాప్తం.ఇరుకు సందుల్లో కాదు.

అంటూ నేషనల్ మీడియా పై తన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు