తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రష్మీ గౌతమ్( Anchor Rashmi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ షోతో( Jabardasth ) భారీగా పాపులారిటీని సంపాదించుకుంది యాంకర్ రష్మి.
కాగా ఈ ముద్దుగుమ్మకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.వెండితెరపై పలు సినిమా లలో నటించినప్పటికీ అంతగా కలిసి రాకపోవడంతో బుల్లితెరకే పరిమితం అయిపోయి ప్రస్తుతం యాంకర్ గా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
కాగా రష్మీ యానిమల్ లవర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.

అలాగే జంతువులకు సంబంధించిన ఎటువంటి విషయమైనా కూడా రష్మీ సీరియస్ గా రియాక్ట్ అవుతూ ఉంటుంది.అంతేకాకుండా జంతువుల విషయంలో ఆమె ఎంతవరకు అయినా కూడా వెళుతుంది.కేవలం జంతువుల విషయంలోనే కాకుండా సమాజంలో జరుగుతున్న అరాచకాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా అలాంటి వీడియో పై స్పందించింది రష్మీ.ఒక పెట్ డాగ్ ని( Pet Dog ) ఒక వ్యక్తి హింసిస్తున్న వీడియో ఆమె దగ్గరికి రావడంతో వెంటనే ఆమె ఆ వీడియో పై రియాక్ట్ అయింది.
రష్మీ తీవ్ర ఆందోళనకు గురైంది.

ఆ కుక్క పిల్లను కాపాడాలంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకుంది.ఢిల్లీ పోలీసులు, పెటా సంస్థ, ఎంపీ మేనకా సంజయ్ గాంధీలను సదరు ట్వీట్ లో ట్యాగ్ చేసింది.అతడు చాలా క్రూయల్ గా ఉన్నాడు.
అతని వలన ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ప్రమాదమే.పిల్లలను లైంగికంగా వేధించేవాడు, రేపిస్ట్ కూడా కావచ్చు.
అంటూ తీవ్ర పదజాలంతో ఆవేదన వ్యక్తం చేశారు.రష్మీ గౌతమ్ ట్వీట్ వైరల్ అవుతుంది.
పెట్ డాగ్ కి ఏమవుతుందో అని రష్మీ గౌతమ్ ఆందోళన చెందారు.రష్మి చేసిన ట్వీట్ పై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.
కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు మాత్రం ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.







