సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి.అయితే ఈ మధ్యకాలంలో అవి తక్కువైపోయాయి.
కానీ గతంలో అయితే చాలామంది ఇంట్లో వారు చూసిన సంబంధాన్నే చేసుకునేవారు.అయితే ఇది సాధారణ జనాల నుండి సెలబ్రెటీల వరకు ఇదే తీరు ఫాలో అయ్యేవారు.
అయితే ఇప్పుడున్న సెలబ్రిటీలైతే చాలామంది ప్రేమలో ఉండి డేటింగ్ చేశాక ఇష్టా ఇష్టాలు కలిస్తేనే పెళ్లి చేసుకుంటున్నారు.కానీ అలనాటి స్టార్ హీరోలు మాత్రం చాలామంది తల్లిదండ్రులు చూసిన సంబంధాలను చేసుకునేవారు.
అయితే మన స్టార్ హీరోలు కొంతమంది తమ సొంత మరదళ్లనే పెళ్లి చేసుకున్నారు.మరి సొంత మరదళ్ళని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం…
కార్తీ-రజని
కోలివుడ్ హీరో సూర్య తమ్ముడుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన హీరో కార్తీ( Karthi ) తెలుగులో ఆయన చేసిన మొదటి సినిమా యుగానికి ఒక్కడు ఈ సినిమాతోనే ఇక్కడ మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన తెలుగులో కూడా మంచి మార్కెట్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు…ఇక డైరెక్ట్ గా తెలుగులో ఊపిరి సినిమా(Oopiri )లో నాగార్జున తో నటించి మంచి హిట్ అందుకున్నాడు…ఇక ఇది ఇలా ఉంటే కార్తీ తన మేన మరదలు అయినటువంటి రజని ని పెళ్లి చేసుకున్నాడు…వీళ్లిద్దరూ ప్రస్తుతం సంతోషం గా వాళ్ల పర్సనల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు…
ఆది- అరుణ

హీరో సాయికుమార్ కొడుకు అయిన ఆది( Aadi Saikuma ) తన మొదటి సినిమా అయిన ప్రేమ కావాలి సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.అలాగే ఆ సినిమా తర్వాత వచ్చిన లవ్లీ సినిమా కుడబ్బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది… ఇక ప్రస్తుతం తెలుగు ఒక మంచి హీరో గా గుర్తింపు పొందిన ఆది తన లైఫ్ లో తన మేన మరదలు అయినటువంటి అరుణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు…వీళ్లిద్దరూ ఎప్పుడు చాలా సంతోషం గా ఉంటారు.ఇలా వీళ్లిద్దరూ కూడా వాళ్ల జీవిత భాగస్వామి గా వాళ్ల మర్ధల్ల ని ఎంచుకొని పెళ్లి చేసుకున్నారు…








