రేవంత్ రెడ్డి కామెంట్స్ పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్...!

యాదాద్రి భువనగిరి జిల్లా: అమెరికాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం సీరియస్ అయ్యారు.ఈ సందర్భంగా అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Komatireddy Venkat Reddy Serious Comments On Revanth Reddy, Komatireddy Venkat R-TeluguStop.com

అమెరికా వెళ్లిన రేవంత్ ఎందుకు అలా మాట్లాడారో తెలియదని,రైతులకు 24 గంటల విద్యుత్ అవసరంలేదని,3 గంటలు విద్యుత్ ఇవ్వాలనడం తప్పేనని అన్నారు.రైతులకు 24 గంటల విద్యుత్ ను మేనిఫెస్టోలో పెడతామని,రేవంత్ చెప్పింది ఏదీ ఫైనల్ కాదని,ఏదైనా తుది నిర్ణయం అదిస్టానానిదేనని నేనైనా,

రేవంత్ అయినా పార్టీకి కో-ఆర్డినేటర్లం మాత్రమేనని చెప్పుకొచ్చారు.

ఇక సీతక్క సీఎం అవుతారనేది పెద్ద జోక్ అని కొట్టిపారేశారు.ఇది రీజనల్ పార్టీ కాదని, ఆయన సొంత పార్టీ అంతకంటే కాదని,రేవంత్ స్థాయికి మించి మాట్లాడడం కరెక్ట్ కాదని హితవు పలికారు.

కాంగ్రెస్ లో చేతులు కలిసినట్లే కనిపిస్తాయి,అంతలోనే కలహించుకుంటాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube