కోడిపందేలపై యాంకర్ రష్మీ ఆసక్తికర వాఖ్యలు

కోడి పందేలు అనేవి ఎన్నో వందల సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో సంప్రదాయ గ్రామీణ వినోదంగా వస్తుంది.సంక్రాంతి వచ్చిందంటే కోస్తా ఆంధ్రాలో కోడిపందేలు సందడి కనిపిస్తుంది.

తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని ప్రజలు ఫాలో అవుతున్నారు.ఒక వినోద క్రీడాగా ఉండే కోడిపందేలు పోటీలని తిలకించడానికి, ఆడటానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

గోదావరి జిల్లాలలో అయితే ఈ కోడి పందేలతో కోట్ల రూపాయిలు చేతులు మారుతూ ఉంటాయి.అయితే జీవ హింస, అలాగే భారీగా బెట్టింగ్ లు జరగడంతో ప్రభుత్వం కోడిపందేలని నిషేధిస్తూ వస్తుంది.

ఎంత నిషేధం విధించిన సంక్రాంతి మూడు రోజులు గోదావరి జిల్లాలలో ఈ పందేలని ఆపే ప్రయత్నం ఎవరూ చేయలేరు.ఇక ఈ కోడి పందేలు చరిత్రలోకి వెళ్తే బొబ్బిలి యుద్ధానికి కారణం కూడా ఇదే.అలాగే పల్నాడు ప్రాంతంలో కోడిపందేలు రక్తపాతాన్ని సృష్టించింది.తమిళనాడులో జల్లికట్టు ఎలాగో ఆంధ్రాలో కోడిపందేలు కూడా అలాగే సంప్రదాయ వినోద క్రీడగా ఉండటంతో ప్రభుత్వాలు, చట్టాలు వీటిని వ్యతిరేకిస్తున్న, జంతువులు, పక్షుల ప్రేమికులు అభ్యంతరం వ్యక్తం చేసిన అపే ప్రయత్నం ఎవరూ చేయలేరు.

Advertisement

ఇదిలా ఉంటే యాంకర్ రష్మీ తాజాగా కోడి పందేలుపై సంచలన వాఖ్యలు చేసింది.సంక్రాంతి వస్తున్న సందర్భంగా ఈ కోడి పందేలు మళ్ళీ మొదలు కావడంతో వాటిపై తన అభిప్రాయాన్ని తెలిపింది.

తాను కోడి పందేల‌కు వ్య‌తిరేక‌మ‌ని అన్నారు.అది చ‌ట్ట‌బ‌ద్దం కాద‌ని, మ‌న ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం ఒక మూగ‌జీవిని అలా హింసించకూడ‌ద‌ని ర‌ష్మి తెలిపింది.

కంట్లో కారం పెట్టి, వాటిని ఇబ్బంది పెట్టడం చాలా త‌ప్ప‌ని, అస్స‌లు అది మాన‌వ‌త్వం అనిపించుకోద‌ని ఆమె వివ‌రించారు.ఏ దేవుడు అలా కోరుకోడ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

ఇక త‌న స్టేట్‌మెంట్ వ‌ల‌న చాలా మంది హ‌ర్ట్ అవ్వొచ్చ‌ని, వారు ఎలా అనుకున్నా ఇబ్బంది లేద‌ని, కానీ తాను మాత్రం వాటికి వ్య‌తిరేక‌మ‌ని వివ‌రించారు.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు